జగన్నాథ్ సాగర్ పునరుద్ధరణ పనులు చేయండి
జయపురం: జగన్నాథ సాగర్ పునరుద్ధరణ పనులు ప్రారంభించకుంటే జయపురం బంద్ చేస్తామని మో జగన్నాథ సాగర్ ట్రస్టు నిర్ణయించింది. స్థానిక గీతా శవణం ప్రాంగణంలో మందిరంలో మో జగన్నాథ సాగర్ ట్రస్టు ఉద్యోగులు రజనీ కాంత నాయిక్ అధ్యక్షతన మంగళవారం జరిగిన ట్రస్టు సభ్యుల సమావేశంలో పునరుద్ధరణ పనులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా రజనీ కాంత నాయిక్ చారిత్రాత్మక జగన్నాథ్ సాగర్ ప్రాధాన్యతను వివరించారు. ఆక్రమణలకు లోనవుతూ శిథిలావస్థకు చేరుకుంటున్న సాగర్‌ను అభివృద్ధి చేయాలన్నారు. మో జగన్నాథ సాగర్ ట్రస్టు ఎన్ని విజ్ఞప్తులు చేసినా పలు ఆందోళనలు జరిపినా సంబంధిత అధికారులు స్పందించటం లేదని విమర్శించారు. జగన్నాథ్ సాగర్ పనులలో అక్రమాలు ఉన్నాయని, అందుకే సాగర్ పునరుద్ధరణ పనులను టాస్క్ ఫోస్క్ ద్వారా నిర్వహించాలని ట్రస్టు డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. జగన్నాథ్ సాగర్ పనులు పూర్తికి సాగర్ పోరాట కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశం తీర్మానించింది. సమావేశంలో పాల్గున్న పట్టణ ప్రముఖులు, మేధావుల అభిప్రాయాలు సేకరించారు. సమావేశంలో సతీష్ నంద, నిరంజన్ పాణిగ్రహి, బరిగడ చంధ్ర శేఖర్, హర మిశ్ర, రఘు త్రిపాఠీ, పట్టణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.మనోజ్ కుమార్, హిమాంశు మహాపాత్ర, విద్యుత్ మిశ్ర, ధిరెన్ మోహణ పట్నాయిక్, సుభాష్ రౌత్, అరుణ కుమార్ భటమిశ్ర, సుధీర్ త్రిపాఠీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment