197 మద్యం సీసాలతో వ్యక్తి అరెస్ట్
తెర్లాం: ఎటువంటి అనుమతులు లేకుండా 197 మద్యం సీసాలను అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన వ్యక్తిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి బుధవారం తెర్లాం ఎస్సై సాగర్‌బాబు చెప్పిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని నందబలగ గ్రామానికి చెందిన ఆనెం శ్రీనివాసరావు తెర్లాం నుంచి 197మద్యం సీసాలు తీసుకువెళ్తుండగా అదే సమయంలో అటుగా వస్తున్న స్పెషల్ బ్రాంచ్, స్థానిక పోలీసులకు గంగన్నపాడు గ్రామం వద్ద మద్యం పట్టుకున్నారు. అనంతరం మద్యం సీసాలను, తీసుకు వెళ్తున్న వ్యక్తిని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి మద్యం సీసాలను సీజ్ చేసుకున్నామని ఎస్సై తెలిపారు.
మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
బొండపల్లి: మండలంలోని వేండ్రాం గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి 9 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ జె.జనార్దనరావు తెలిపారు. గ్రామానికి చెందిన లెంక అప్పలనాయుడు గ్రామంలోని తన ఇంటి వద్ద అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించి అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సై పి.నరేంద్ర కుమార్, హెచ్‌సీలు జె.బాషా, లోకాభిరామ్, రాజు, గంగాధరుడు తదితరులు పాల్గొన్నారు.
197 మద్యం సీసాలతో వ్యక్తి అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment