స్వగ్రామానికి వలస కార్మికుని మృతదేహం
జయపురం: పూనే–ట్రోన్ రైల్వే స్టేషన్‌ల మధ్య ఈ నెల 16న రైలు నుంచి జారి కిందపడి మరణించిన వలస కార్మికుని మృతదేహం బుధవారం అతని స్వగ్రామం బొయిపరిగుడ సమితి బొదాపుట్ గ్రామ పంచాయతీ కురకుటి గ్రామం చేరింది. కురుకుటి గ్రామ వాసి బినోద్ ఖొడ (43)ఎంతో కాలంగా మహారాష్ట్రలోని లునావాలా గ్రామంలో ఒక ఒక కాంట్రాక్టర్ వద్ద పని చేస్తున్నాడు. కొన్ని రోజుల కిందట స్వగ్రామం వచ్చాడు. తిరిగి మహారాష్ట్ర వెళ్లేందుకు విశాఖపట్నంలో మహారాష్ట్ర లునావాల్‌కు రైలులో బయల్దేరాడు. ఈ నెల 16 వ తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలోపూనే–ట్రోన్ రైలు మార్గంలో రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. ట్రోన్ రైల్వే స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుని వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. మృతదేహాన్ని గ్రామానికి రప్పించే విషయలో వారు బొయిపరిగుడ పోలీసులను సహాయం కోరారు. అనంతరం వారు కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం మచ్చను ఆశ్రయించారు. మచ్చ వెంటనే ముంబాయి పోలీసులకు ఫోన్ చేసి మృతదేహాన్ని రప్పించే ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment