గుర్తు తెలియని మృతదేహం లభ్యం
మల్కన్‌గిరి: జిల్లాలోని మత్తిలి సమితి పోలీసుస్టేషన్ పరిధి గోవిందపల్లి పంచాయతీ నూవగూడ గ్రామం అడవి మార్గంలో చెట్టుకు వేలాడుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గురువారం లభ్యమైంది. దీంతో స్థానికులు వెంటనే మత్తిలి పోలీసులకు సమాచారం అందజేశారు. మత్తిలి ఐఐసీ దేవదత్తు మల్లిక్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. అలాగే మల్కన్‌గిరి ఎస్‌డీపీవో సచిన్‌పటేల్ కూడా వెళ్లి మృతదేహంపై విచారణ చేపట్టారు. అయితే అక్కడ ఎవరికీ తెలియదని చెప్పడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
43 కేజీల గంజాయి పట్టివేత
మల్కన్‌గిరి: జిల్లాలోని మల్కన్‌గిరి సమితి చలాన్‌గూడ గ్రామం వద్ద 43 కేజీల గంజాయిని ఎకై ్సజ్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీష్‌గడ్ రాష్ట్రం బస్తర్ జిల్లాకు చెందిన తనీష్ బాగెల్, దినేష్ కశ్యప్, నాగేశ్ యాదవ్, పుష్పరాజ్ బట్టిలు మల్కన్‌గిరి ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేశారు. అనంతరం తిరిగి బస్తర్ వెళ్తున్న సమయంలో రెండు ద్విచక్ర వాహనాలు అతివేగంగా వెళ్లడం గమనించి చలాన్‌గూడ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఎకై ్సజ్ పోలీసులు ఆపారు. అనంతరం బైక్‌లపై ఉన్నటువంటి బస్తాలను తనిఖీ చేయగా గంజాయి బయటపడింది. దీంతో వెంటనే వారిని అరెస్టు చేశారు. అలాగే వారి వద్ద నుంచి సెల్‌ఫోన్లు, ఆధార్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. 43 కేజీల గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో రూ.4.40 లక్షలు మల్కన్‌గిరి ఎకై ్సజ్ ఎస్‌ఐ ఆశిష్ కుమార్ బోయి తెలిపారు.
చోరీ కేసులో దొంగలు అరెస్టు
కొరాపుట్: ఒక చోరీ కేసుకు సంబంధించి దొంగలను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నబరంగ్‌పూర్ జిల్లా కేంద్ర పోలీసుస్టేషన్ ఐఐసీ సంబిత్ కుమార్ బెహర ఈ కేసు వివరాలు వెల్లడించారు. ఈనెల 22వ తేదీన రంగమట్టిగుడ గ్రామానికి చెందిన కై లాస్ కుమార్ చౌదరి ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో బీరువాలు పగలుగొట్టి 15 గ్రాముల బంగారు, 40 గ్రాముల వెండి వస్తువులు, రూ.40 వేల నగదు దోచుకెళ్లారు. దీంతో బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో దసరా పొద ప్రాంతానికి చెందిన అంజు హరిజన్, ధనుర్జయ హరిజన్‌లు దొంగతనం చేసినట్లు గుర్తించి అరెస్టు చేశారు. వారి నుంచి చోరీ సొత్తు రికవరీ చేశారు. కేసును ఎస్‌ఐ కులభూషణ్ నాయక్ దర్యాప్తు చేస్తున్నారు.
జిమిడిపేటను సమితిగా గుర్తించాలి
రాయగడ: సదరు సమితి పరిధిలోని జిమిడిపేట పంచాయతీని సమితిగా గుర్తించాలని ఆ ప్రాంత ప్రజలు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ ఫరూల్ పట్వారీకి వినతిపత్రం గురువారం అందజేశారు. జిమిడిపేటకు సమీపంలోని కెరడ, హటోశశిఖాల్, గజ్జిగ, ఇరుకుబడి, బైరాగి హలువ వంటి పంచాయతీలతో కూడిన సమితిగా జిమిడిపేటను గుర్తించగలిగితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఆరు పంచాయతీల్లో సుమారు 50 వేలకు పైగా కుటుంబాలు నివసిస్తున్న నేపథ్యంలో వారి ఆర్థిక, సామాజిక రంగాలు కూడా ఎంతో మెరుగుపడే అవకాశం ఉందని వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ మితా పువల తదితరులు పాల్గొన్నారు.
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
Comments
Please login to add a commentAdd a comment