సేవా పేపరుమిల్లు పునరుద్ధరించాలి
● ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎమ్మెల్యే బాహిణీపతి విజ్ఞప్తి
జయపురం: జయపురం గగణాపూర్‌లోని సేవా పేపరుమిల్లును వెంటనే పునరుద్ధరించాలని జయపురం ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతి కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ అహుజను గురువారం కలిసి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో కొత్త కంపెనీ, థాపర్ గ్రూపులు ఎంవోయూ చేసుకొని మిల్లు నపిపేందుకు చర్యలు చేపట్టిందని గుర్తు చేశారు. మిల్లు నడిపేందుకు, మిల్లు మరమ్మతులకు, కార్మికుల బకాయిలు తీర్చేందుకు, విద్యుత్, నీరు బకాయి బిల్లులు ముడిసరుకులు అప్పులు చెల్లించేందుకు కొత్త యాజమాన్యం రూ. 200 కోట్లు రుణం తీసుకు వచ్చిందన్నారు. అయితే ఆ డబ్బు ఎంత ఖర్చు చేసిందో రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్టుపై ఎమ్మెల్యే ప్రధాన కార్యదర్శితో చర్చించారు. మిల్లు ఏడు నెలలుగా మూత పడి ఉత్పాదన నిలిచిపోయిందని వెల్లడించారు. మిల్లులో ఉత్పాదన ఆగిపోవటంతో అ ప్పటి నుంచి శ్రామికులకు జీతాలు, పాత బకాయి లు, పీఎఫ్, ముడిసరుకుల బకాయిలు చెల్లించలేద ని వివరించారు. శ్రామికులకు జీతాలు చెల్లించలేక పోవటంతో వారు దుర్భర జీవితం గడుపుతున్నారన్నారు. బకాయిలు చెల్లించాలని ఎంతో కాలంగా శ్రామికులు ఆందోళన చేస్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవకపోవటం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. 2020, 2023లో న్యూఢిల్లీ వెళ్లి థాపర్ బోర్డు చైర్మన్ పాజేష్‌ను కలసి గగణాపూర్ పేపరుమిల్లు పరిస్థితులపై చర్చించి వెంటనే మిల్లు పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికై నా తగు చర్యలు తీసుకొని మిల్లును తెరిపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment