కేంద్రబడ్జెట్‌ను నిరసిస్తూ వామపక్షాల ఆందోళన
పర్లాకిమిడి: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ బడా కార్పొరేటర్లకు అనుకూలంగా ఉందని వామపక్ష నాయకులు అన్నారు. రైతులు, రైతుకూలీలు, సామాన్యులకు దగా బడ్జెట్‌గా మారిందని దుయ్యబట్టారు. స్థానిక హైస్కూల్ జంక్షన్ వద్ద సీపీఐ, సీపీఎం, సీపీఎంఎల్ (లిబరేషన్), ఆలిండియా కిసాన్ సభ, ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానిన శుక్రవారం చేపట్టారు. దేశంలో బీమా కంపెనీలపై కేంద్రం వంద శాతం పెట్టుబడులు ఉపసంహరణ చేశారని, విద్య, వైద్యం, వ్యవసాయం పెట్టుబడులను పక్కన బెడుతూ కార్పొరేటర్లకు పట్టం కట్టారని సీపీఎం జిల్లా కార్యదర్శి దండపాణి రైయితో విమర్శించారు. ఒకపక్క ద్రవ్యోల్భనం పెరిగిపోతుందని, జాతీయ ఉపాధి హామీ పథకం వేతనదారులకు ఇస్తున్న దినసరి వేతనం 50 శాతం పెంచాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జోన్న సుభాష్ చంద్రరావు అన్నారు. ఆందోళన కార్యక్రమంలో సీపీఎంఎల్ (లిబరేషన్) అధ్యక్షులు శ్రీనివాస బెహారా, లింగరాజు దోళాయి, ఎ.భాస్కర్‌ర్రావు, ఎం.బంగారి పాల్గొన్నారు.
కేంద్రబడ్జెట్‌ను నిరసిస్తూ వామపక్షాల ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment