ఎస్టీ జాబితాలో చేర్చాలని రాష్ట్రపతికి వినతి
రాయగడ: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక నేతృత్వంలో గిరిజన నాయకుల ప్రతినిధులు శుక్రవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. గరిజనుల హక్కులు, భాష గుర్తింపు, జొడియా సంప్రదాయులుగా నివసిస్తున్న వారిని రాష్ట్రంలో షెడ్యూల్ తెగ జాబితాలో చేర్పించాలని విన్నవించారు. జొడియా తెగలను ఎస్టీలుగా గుర్తించకపోవడంతో ప్రభుత్వ పథకాలను వారు పొందలేకపోతున్నారని, విద్యారంగంలో కూడా నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వివరించారు. కొరాపుట్, కలహండి, రాయగడ జిల్లాల్లో అత్యధికంగా నివసిస్తున్న ఈ జొడియా సంప్రదాయానికి చెందిన ఆదివాసీలను ఎస్టీ జాబితాలొ గుర్తించేవారని, 1997 అనంతరం ఆ జాబితా నుంచి వీరిని తొలగించడంతో ఇప్పటివరకు వీరు ఆదివాసీలుగా గుర్తింపునకు నొచుకోవడం లేదన్నారు. ఇప్పటికై నా వీరిని ఎస్టీ జాబితాలో గుర్తించాలని రాష్ట్రపతిని విన్నవించుకున్నారు. రాష్ట్రపతిని కలిసిన వారిలో గుణుపూర్ ఎమ్మెల్యే సత్యజీత్ గొమాంగొ, రాంప్రసాద్ జొడియా, సంధు చరణ్ మాఝి, తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment