‘పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించండి’
జయపురం: కళలు, క్రీడలు నేర్పే శిక్షకులను పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని ఒడిశా కళా, క్రీడా శిక్షక సంఘం జయపురం సబ్‌డివిజన్ శాఖ డిమాండ్ చేసింది. గురువారం కళా, క్రీడా శిక్షక సంఘం జయపురం నేతృత్వంలో పలువురు శిక్షకులు జయపురం బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారిని ఘెరావ్ చేశారు. ఈ సందర్భంగా వారు బీఈఓకు వినతి పత్రాన్ని అందజేయడానికి వెళ్లి ఆయన లేకపోవడంతో అదనపు బీఈఓకు అందజేశారు. 2013లో వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న కళ, క్రీడా ఉపాధ్యాయుల నియుక్తికి ప్రభుత్వం ప్రకటన జారీ చేసిందని, అప్పట్లో అభ్యర్థులు పరీక్షలు రాశారని, అందులో ఉత్తీర్ణులైన వారిని తాత్కాలిక టీచర్లుగా నియమించారని గుర్తు చేశారు. తమను పర్మినెంట్ ఉద్యోగులుగా పరిగణించాలని కోరారు. పన్నెండేళ్లుగా ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఎవరూ పట్టించుకోలేదని, నిర్ణయం తీసుకోకపోతే ఆందోళన బాట పడతామన్నారు. వినతి పత్రం సమర్పించిన వారిలో ఉపాధ్యాయులు పద్మిణీ బెహర, సురేష్ కుమార్ నాయిక్,రాజేంధ్ర కుమార్ పట్నాయిక్,స్మిత రథ్,బబుల సాహు,మృత్యంజయ భొయ్, జ్యోతిర్మయి మిశ్రా, శిశిర కుమార్ డాకువ, మణికుమార్ మహాపాత్రో, సుజాత బారిక్, సపన నాయిక్, పద్మ చరణ చౌధురి, నర్సింగ ప్రసాద్ షొడంగి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment