మార్చి 15లోగా పనులు పూర్తి
పర్లాకిమిడి: స్థానిక రైల్వేస్టేషన్‌లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను మార్చి 15వ తేదీలోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఈస్టుకోస్టు వాల్తేరు రైల్వే డివిజన్ డీఆర్‌ఎం మనోజ్ కుమార్ సాహు అన్నారు. పనులను పరిశీలించేందుకు గురువారం ఆయన పర్లాకిమిడి విచ్చేశారు. భారత్ అమృత్ స్టేషన్ల నవీకరణలో భాగంగా పర్లాకిమిడి రైల్వేస్టేషన్‌లో సుమారు రూ.20 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంతో స్టేషన్‌లో ఓవర్ బ్రిడ్జి, రైల్వే కేటరింగ్ సర్వీసెస్, టాయిలెట్స్, కింగ గ్రామ రోడ్డు వద్ద లైటింగ్, ప్లాట్ ఫారం పనులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఆర్‌ఎం మనోజ్ కుమార్ రైల్వే ఇంజినీర్లుతో మాట్లాడి తిరిగి విశాఖపట్నం బయల్దేరారు. ఆయనతో పాటు సీనియర్ డివిజనల్ మేనేజర్(విశాఖపట్నం) అరుణ్ కుమార్ మహారాణా తదితరులు ఉన్నారు.
మార్చి 15లోగా పనులు పూర్తి
Comments
Please login to add a commentAdd a comment