శ్రీకాకుళం న్యూకాలనీ: అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ పెట్టిందని విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్మత్స విష్ణుకుమార్‌రాజు పేర్కొన్నారు. బుధవారం బీజేపీ శ్రీకాకుళం జిల్లా శాఖ అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో ఇటీవల ప్రవేశపెట్టిన ప్రజా బడ్జెట్ 2025–26పై మేధావుల సమావేశం నిర్వహించారు. బడ్జెట్‌లోని ముఖ్య అంశాలపై పలువురు వక్తలు చర్చించారు. కార్యక్రమంలో డాక్టర్ కె.అమ్మన్మాయుడు, చార్టర్డ్ అకౌంటెంట్ ఐ.కె.రావు, రిటైర్డ్ జడ్జి పప్పల జగన్నాథం, అంబేడ్కర్ యూనివర్సిటీ విశ్రాంత రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గుంట తులసీరావు, కంపెనీ సెక్రటరీ బుర్రా భార్గవ్, విద్యావేత్త నిక్కు అప్పన్న, ఎన్‌జీవో మణిశర్మ, గురజాడ విద్యాసంస్థల ప్రతినిధి సంయుక్త, విద్యావేత్త జామి భీమశంకర్, జర్నలిస్టు సంఘ నాయకుడు కొంక్యాణ వేణుగోపాల్, డాక్టర్ పైడి సింధూర, బీజేపీ నాయకులు పూడి తిరుపతిరావు, పైడి వేణుగోపాలం, కరుణాకరరావు, నరేంద్రచక్రవర్తి, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment