మద్యం దుకాణాలను తరలించాలని వినతి
రాయగడ: పట్టణంలోని మూడు విదేశీ మద్యం దుకాణాలను వేరేచోటకు తరలించాలని, లేదంటే ఆందోళన చేపడతామని వికాస్ మంచ్ డిమాండ్ చేసింది. జిల్లా అబ్కారీశాఖ అధికారికి మంచ్ వికా స్ సభ్యులు బుధవారం వినతిపత్రం అందించారు. పట్టణంలోని 3, 11, 15 నంబర్లతో చెలామణి అవుతున్న మద్యం దుకాణాల వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. జనావాసా ల్లో గల ఈ దుకాణాలను వేరే ప్రాంతాలకు తరలించాలని గత నెల 8న సంబంధిత శాఖ అధికారి దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు. ఇప్పటికై నా సమస్యను పరిష్కరించకపోతే అబ్కారీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రాయగడ జిల్లా వికాస్ మంచ్ అధ్యక్షుడు దయానంద ఖడంగ, సభ్యులు మనోజ్ సాహు, రాజు నాయక్, తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment