పర్యావరణ పరిరక్షణపై సైకిల్ యాత్ర
మల్కన్‌గిరి: పర్యావరణ పరిరక్షణపై సంభల్‌పూర్‌కు చెందిన శుభం బారిక్ అనే 21 ఏళ్ల యువకుడు సైకిల్‌పై చేస్తున్న దేశ యాత్ర మంగళవారం రాత్రి మల్కన్‌గిరి జిల్లా మత్తిలి సమితికి బుధవారం చేరింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఒక మనిషి–ఒక చెట్టు నినాదంతో ప్రజల్లో అవగహన కాల్పించాలనే ఉద్దేశంతో గత ఏడాది డిసెంబర్ 27వ తేదీ సైకిల్ యాత్రకు బయలు దేరిన శుభం బారిక్ జర్స్‌గూఢ, సందర్‌గూఢ, కేందుజోర్, మయుర్‌బంజ, బాలేశ్వర్, భద్రక్, జాజ్‌పూర్, కేంద్రపోఢ, జగత్సంగ్‌పూర్, కటాక్, పూరీ, ఖుర్ధా, నయాగఢ్, గంజామ్, గజపతి, రాయగడ, కోరపుట్ ప్రాంతాల్లో పర్యటించి బుధవారంమల్కన్‌గిరి జిల్లాకు చేరుకున్నారు. మత్తిలి పోలీసులు ఆయనకు స్వాగతం పలికి బస ఏర్పాటు చేశారు. మల్కన్‌గిరి ఉత్కళ విలేకర్ల సంఘం సభ్యులు కూడా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment