అవినీతి నిరోధక కమిటీ జిల్లా కన్వీనర్‌గా రాంబాబు
జయపురం: అఖిల భారత అవినీతి నిరోధక కమిటీలో జయపురానికి చెందిన ప్రముఖ కళాకారుడు, సమాజ సేవకుడు గండ్రేటి రాంబాబుకు అవకాశం దక్కింది. కొరాపుట్ జిల్లా అవినీతి నిరోధక కమిటీ కన్వీనర్‌గా ఆయన నియమితులయ్యారు. అఖిల భారత అవినీతి నిరోధక సంఘటన కన్వీయర్, ఒడిశా హైకోర్టు న్యాయవాది సుభ్రత కుమార్ నందో సోమవారం విడుదల చేసిన లేఖలో ఈ విషయాన్ని వెల్లడించారు. నెల రోజుల్లో జిల్లా అంతా పర్యటించి జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని రాంబాబుకు సుభ్రత కుమార్ నందో సూచించారు. కొరాపుట్ జిల్లాలో వివిధ ప్రభుత్వ పదవీ కాలంలో చోటు చేసుకుంటున్న అవినీతి అక్రమాలపై వివరాలు సేకరించేందుకు నూతన కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు రాంబాబు మంగళవారం వెల్లడించారు.
ఖోఖో క్రీడాకారిణికి అభినందనలు
రాయగడ: ఇటీవల ముగిసిన ప్రపంచ ఖోఖో పోటీల్లో విజేతలుగా నిలిచిన భారత మహిళా జట్టులో సభ్యురాలుగా ఉన్న మంగాయి మఝిని జిల్లా కలెక్టర్ ఫరూల్ పట్వారి అభినందించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్రీడాకారిణి మంగాయి మఝికి దుశ్శాలువతో సత్కరించి అభినందించారు. ప్రపంచ ఖోఖో పోటీల్లో ఇండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ జట్టులో రాయగడ జిల్లాలోని కాసీపూర్ సమితి చంద్రగిరి పంచాయతీకి చెందిన మంగాయి మాఝి పాల్గొని భారత్‌తో పాటు రాష్ట్ర ప్రతిష్టను పెంపొందించారని ఈ సందర్భంగా కలెక్టర్ అన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రీడా శాఖ అధికారి షేక్ ఆలీనూర్ పాల్గొన్నారు.
రాయగడ బ్లాక్‌లో 28న జాబ్‌మేళా
పర్లాకిమిడి: ఈనెల 28న రాయగడ బ్లాక్ చంపాపూర్ వద్ద మినీస్టేడియంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అధికారి సౌభాగ్య స్మృతి రంజన్ త్రిపాఠి మంగళవారం తెలిపారు. టెన్త్ ఫెయిల్ నుంచి పట్టభద్రులు, పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్థులకు స్కిల్ ట్రైనింగ్‌తోపాటు ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్టు త్రిపాఠి తెలియజేశారు. ఈ జాబ్ మేళాకు దాదాపు 40 ప్రైవేటు కంపెనీలు పాల్గొంటాయన్నారు. విద్యార్థులు తమ విద్యార్హల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో పాటు ఫొటోలు, ఆధార్ కార్డు తీసుకొని హాజరు కావాలన్నారు.
అవినీతి నిరోధక కమిటీ జిల్లా కన్వీనర్‌గా రాంబాబు
Comments
Please login to add a commentAdd a comment