పెరిగిన మృతుల సంఖ్య
జయపురం: జయపురం సమితి టంకువ పంచాయతీ ధనముండ వంతెన సమీపంలో ఘోర ప్రమాదం జరిగిన విషయం విదితమే. ఆటో టిప్పర్ ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రమాదానికి గురైన వారంతా కూలి పనులు చేసుకుంటూ బతికేవారే. రోజ్‌గార్ పనుల్లో యంత్రాలు వినియోగిస్తుండడంతో జాబ్ కార్డులు ఉన్నా పనులు లభించని ఆ గ్రామ ప్రజలు ఆటోల్లో జయపురం పట్టణంలో కూలి పనులకు వెళ్తుంటారు. అలా వెళ్తుండగానే ప్రమాదం జరిగి లెంజ గ్రామానికి చెందిన అభి పంగి(60), గురు మఝి(18)ఆటో డ్రైవర్ లయిచన్ గొలారి(50) మరణించారు. అభి పంగి సంఘటనా స్థలం వద్దనే మరణించగా లయిచన్ గొలారీ కొరాపుట్ సహిద్ లక్ష్మణ నాయిక్ వైద్య కళాశాల హాస్పిటల్ లో ముందు మరణించారు. తర్వాత చికిత్స పొందుతూ గురు మఝి మరణించినట్లు సమాచారం. ఆటోడ్రైవర్ తండ్రి గుండెలవిసేలా రోదించారు. రెడ్‌క్రాస్ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.10వేలు సాయం అందజేశారు.
పెరిగిన మృతుల సంఖ్య
Comments
Please login to add a commentAdd a comment