వృద్ధులకు ఉచిత ప్రయాణం
మల్కన్‌గిరి నుంచి..
కొరాపుట్:
అసోంలోని కామాఖ్యా, కోల్‌కతాలోని దక్షిణ కాళీ దర్శనాలకు వెళ్లే వృద్ధులకు ఉచిత ప్రయాణ అవకాశాన్ని కల్పించారు. ఈమేరకు మంగళ వారం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలో డాబుగాం ఎంఎల్‌ఏ మనోహర్ రంధారి జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. జిల్లా నుంచి 130 మంది వృద్ధులు పయనమయ్యారు. కార్యక్రమంలో డీఐపీఆర్‌వో మనోజ్ కుమార్ బెహరా పాల్గొన్నారు. కొరాపుట్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ వి.కీర్తి వాసన్ జెండా ఊపి బస్సులు ప్రారంభించారు. ఈ జిల్లా నుంచి 167 మంది తీర్థ యాత్రలకు వెళ్తున్నారు. ఈ బస్సులన్నీ రాయగడ చేరుకుని అక్కడ నుంచి రైలులో ముందుకు సాగనున్నారు. వీరందరికీ ఉచిత రవాణా, ఆహారం, వసతితి ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది.
తీర్థయాత్రలకు సీనియర్ సిటిజన్ల పయనం
రాయగడ: దారిద్య్ర రేఖ దిగువన గల సీనియర్ సిటిజన్లను రాష్ట్ర ప్రభుత్వం ఏటా సొంతఖర్చులతో తీర్థయాత్రలకు పంపిస్తోంది. బీజేపీ కూడా ఆ పథకాన్ని కొనసాగిస్తోంది. మంగళవారం 775 మంది సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక రైలులో తీర్థయాత్రలకు పంపించింది. స్థానిక రైల్వే స్టేషన్‌లో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ ఫరూల్ పట్వారి ముఖ్యఅతిథిగా హాజరై పచ్చ జెండాను ఊపి రైలును ప్రారంభించారు. అవిభక్త కొరాపుట్ జిల్లాలోని కొరాపుట్, రాయగడ నవరంగపూర్, మల్కన్‌గిరి జిల్లాలతో పాటు కలహండి, నువాపడ జిల్లాలకు చెందిన సీనియర్ సిటిజన్లు ఈ తీర్థయాత్రలు చేయనున్నారు. వీరికి ఎస్కార్ట్‌గా మరో 25 మందిని ప్రభుత్వం పంపించింది. వారి ఆలనాపాలన, అవసరమైనవి అందివ్వడంతో పాటు వారికి పర్యటన రోజుల్లో దిక్సూచిగా వీరు వ్యవహరిస్తారని కలెక్టర్ తెలిపారు. ఈ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 31988 మంది సీనియర్ సిటిజన్లు తీర్థ యాత్రలకు వెళ్లి వచ్చారని చెప్పారు. మంగళవారం పర్యటించిన సీనియర్ సిటిజన్లు రాయగడ నుంచి కోల్‌కతా–కామాక్షి వరకు పర్యటించి తిరిగి వస్తారు. కార్యక్రమంలో రాయగడ మున్సిపాలిటీ చైర్మన్ మహేష్ కుమార్ పట్నాయక్, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయగడ నుంచి బయలు దేరిన ప్రత్యేక రైలును సుందరంగా అలంకరించారు. సీనియర్ సిటిజన్లకు జిల్లా యంత్రాంగం సాదరంగా స్వాగతం పలికింది.
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా నుంచి 71 మంది వృద్ధులను తీర్థయాత్రలకు పంపనున్నారు. రెండు బస్సుల్లో బుధవారం వారిని రాయగడ పంపించి అక్కడి నుంచి ట్రైన్‌లో అస్సోంలోని కామాక్షి అమ్మవారి దర్శనానికి పంపించనున్నారు. మొత్తం ఏడు రోజుల పాటు ప్రయాణించనున్నారు. బస్సును జిల్లా అదనపు కలెక్టర్ వేద్బర్ ప్రధాన్ ప్రారంబించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాధికారి మాధవ్ పంగి, జిల్లా డీఐపీఆర్‌ఓ ప్రమిళా మాఝి తదితర అధికారులు పాల్గొన్నారు.
వృద్ధులకు ఉచిత ప్రయాణం
వృద్ధులకు ఉచిత ప్రయాణం
Comments
Please login to add a commentAdd a comment