ఉపాధ్యాయ ప్రీమియర్ క్రికెట్ టోర్నీ చాంపియన్ బొయిపరిగ
జయపురం: జయపురం సమితి అంబాగుడ స్టేడియం మైదానంలో కొరాపుట్ జిల్లా ఉపాధ్యాయ ప్రీమియర్ క్రికెట్ టోర్నమెంట్ మంగళవారం జరిగింది. ఈ టోర్నమెంట్‌లో బొయిపరిగుడ టీమ్ ఘన విజయం సాధించింది. ఈ టోర్నమెంట్‌ను జయపురం బ్లాక్ విద్యాధికారి చందన కుమార్ నాయిక్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. జయపురం ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం వారు నిర్వహించిన ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో జయపురం, కుంధ్ర, బొరిగుమ్మ, లక్ష్మిపూర్, బొయిపరిగుడ, లమతాపుట్ సమితుల నుంచి జట్లు పాల్గొన్నాయి. తొలి మ్యాచ్ జయపురం–కుంధ్ర టీమ్‌ల మధ్య జరిగింది. 10 ఓవర్లలో 62 పరుగులు చేయగా 63 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కుంధ్ర ఉపాద్యాయుల టీమ్ 4.4 ఓవర్లలో 63 పరుగులు చేసి గెలుపొందింది. రెండో మ్యాచ్‌లో బొరిగుమ్మ, లక్ష్మీపూర్ టీమ్‌లు తలపడ్డాయి. బొరిగుమ్మ టీమ్ 6 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసి గెలుపొందింది. మూడో మ్యాచ్‌లో లమతాపుట్, బొయిపరిగుడ టీమ్‌లు తలపడగా బొయిపరిగుడ టీమ్ 6.5 ఓవర్లలో 83 పరుగులు చేసి లమతాపుట్‌ను ఓడించింది. అనంతరం కుంధ్రా, బొయిపరిగుడ జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడాయి. టాస్ గెలిచి కుంధ్ర టీమ్ బ్యాటింగ్ ప్రారంభించింది. కుంధ్ర టీమ్ 12 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది. 97 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బొయిపరిగుడ టీమ్ 8 వికెట్లు కోల్పోయి తన లక్ష్యం 97 పరుగులు చేసి చాంపియన్‌గా నిలిచింది. కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు గోపీ పట్నాయిక్, సురేంధ్ర మహాపాత్రో, ప్రాథమిక ఉపాద్యాయ సంఘ అధ్యక్షుడు దేవీ ప్రసాద్ దాస్, బ్లాక్ విశ్రాంత విద్యాదికారి మానస ముఖర్జీ, కార్యదర్శి ప్రదీప్ కుమార్ మిశ్ర, ఉపాధ్యక్షుడు సదానంద సామంతరాయ్, కేషియర్ పురందర నాయిక్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment