జగన్నాథుడిని దర్శించుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు
రాయగడ: బీజేపీ రాయగడ జిల్లా అధ్యక్షునిగా నియమితులైన ఎం.గొపి ఆనంద్ తన మద్దతు దారులతో పూరి శ్రీజగన్నాథుడ్ని సోమవారం దర్శించుకున్నారు. జిల్లా అధ్యక్ష పదవికి 13 మంది బరిలో ఉండగా గొపిని అధిష్టానం ఎంపిక చేయడంపై ఆయన మద్దతుదారులు హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జగన్నాథస్వామిని దర్శించుకున్న ఆయన జిల్లాలో పార్టీ బలొపేతానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. అందరి సహాకారంతో పార్టీని ముందుకు తీసుకువెళ్లి ప్రభుత్వ పథకాలు ప్రజల దరికి చేరేలా కృషి చేస్తానని వివరించారు. స్వామి దర్శనానికి వెళ్లినవారిలో సీనియర్ నాయకుడు శివశంకర్ ఉలక, భాస్కర పండ, దేశాశీష్ పండ, పలువురు కార్యకర్తలు ఉన్నారు.
బాలిక ఆత్మహత్యాయత్నం
జయపురం: జయపురం సమితి బంకబిహారి గ్రామంలో ఒక బాలిక తన తల్లితో ఏదో విషయంపై గొడవ పడి సమీప అప్పర్ కొలాబ్ ఇరిగేషన్ ధనపూర్ కెనాల్‌లో దూకి ఆత్మహత్య చేసుకోబోయింది. ఆ ప్రాంతంలో ఉన్న వారు చూసి వెంటనే ఆమెను రక్షించి కొరాపుట్ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. డాక్టర్లు వెంటనే చికిత్స ప్రారంభించగా ఆమెకు ప్రమాదం తప్పిందని తెలిసింది. వివరాల్లోకి వెళితే.. భైరాగిమఠం గ్రామం లో +2 చదువుతున్న పూజా హరిజన్ తన తల్లితో ఏదో విషయమై గొడవపడింది. ఇరువురి మధ్య మాటలు పెరగడంతో ఆమె ధనపూర్ శాఖా కెనాల్‌లో దూకేసింది. దీంతో స్థానికులు రక్షించి ఆస్పత్రికి తీసుకెళ్లారు.
కాంగ్రెస్‌లోకి బీజేడీ యువనేత
కొరాపుట్: బీజేడీ పార్టీ సీనియర్ గిరిజన యువజన నాయకుడు అఖిల్ బోత్ర ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లోని పీసీసీ కార్యాలయంలో ప్రముఖుల సమక్షంలో మంగళవారం పార్టీలో చేరారు. పీసీసీ నూతన అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ పదవీ బాధ్యతలు స్వీకరించిన సమయంలో ఈ చేరిక జరిగింది. నబరంగ్‌పూర్ జిల్లాకి చెందిన అఖిల్ తన రాజకీయ జీవితం మాజీ ఎంపీ ప్రదిప్ మజ్జి బాటలో కొనసాగించారు. ప్రదిప్‌తో కలిసి కాంగ్రెస్‌ను వీడి బీజేడీలో చేరారు. ఆ పార్టీలో ఇమడలేక ప్రదిప్‌ని వదలి తిరిగి మాతృ పార్టీ కాంగ్రెస్ గూటికి చేరారు.
కలిమెల సమితిలో నీటి సమస్య
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి కంగూర్‌కొండ గ్రామంలో వేసవి ప్రారంభానికి ముందే ప్రజలు మంచినీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. గ్రామంలో బోరుగాని, బావిగాని లేదు. దీంతో మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నది నుంచి నీటిని తెచ్చుకొని అవసరాలు తీర్చుకుంటున్నారు. అయితే వేసవి ప్రారంభం కావడంతో నదిలో కూడా నీటి ప్రవాహం తగ్గింది. దీంతో ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. సమస్యను పరిష్కరించాలని కోరుతూ గ్రామీణ నీటి సరఫర విళభాగం జూనియర్ ఇంజినేర్ నిత్యానాందొ సోరాన్‌ను గ్రామస్తులు మంగళవారం కలిసి విజ్ఞప్తి చేశారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
జగన్నాథుడిని దర్శించుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు
జగన్నాథుడిని దర్శించుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు
జగన్నాథుడిని దర్శించుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment