
ఎంపికల్లో క్రీడాకారుల ప్రతిభా విన్యాసాలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా పెన్‌కాక్ సిలాట్ క్రీడాకారుల ఎంపిక పోటీలు ఆదివారం ఉత్సాహభరితంగా సాగాయి. శ్రీకాకుళం జిల్లా పెన్‌కాక్ సిలాట్ అసోసియేషన్ అధ్యక్షుడు, గ్రాండ్ మాస్టర్ ఆర్.దయామయ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో ఈ ఎంపికలను నిర్వహించారు. ఈ ఎంపికలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 75 మంది క్రీడాకారులు హాజరై తమ ప్రతి భను నిరూపించుకున్నారు. రాష్ట్ర పోటీలకు 18 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. ఇక్కడ ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 24, 25 తేదీల్లో చిత్తూరు జిల్లా రేణిగుంట వేదికగా జరగనున్న ఏపీ రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామని నిర్వాహకులు తెలిపారు. జిల్లా పెన్‌కాన్ సిలాట్ కార్యదర్శి నక్క లక్ష్మన్నాయుడు, కోచ్ యశ్వంత్‌లు ఎంపికలను నిర్వహించారు. పోటీలకు శ్రీకాకుళం రూరల్ నుండి చిట్టి సూర్యనారాయణ, అలికాన రాము, చంద్రశేఖర్ మాస్టర్లు, రణస్థలం, లావేరు నుంచి ఈశ్వరరావు గార నుంచి శివరాం మాస్టర్లు వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment