
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నిమామక పత్రం అందుకుంటున్న రఘుబర్ దాస్
శుక్రవారం శ్రీ 20 శ్రీ అక్టోబర్ శ్రీ 2023
● ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి కార్యాలయం ● ఈయన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి ● ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు
సంతోష్‌పూర్‌లో పులి సంచారం..?
నూతన
గవర్నర్‌గా
భువనేశ్వర్: ఒడిశా తదుపరి గవర్నర్‌గా రఘుబర్ దాస్ నియమితులయ్యారు. ఆయన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి. ఈ మేరకు రాష్ట్రపతి భవ్‌న్ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రొఫెసర్ గణేషీ లాల్ స్థానంలో రఘుబర్ దాస్ బాధ్యతలు చేపట్టనున్నారు. గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి నియామకం ఉత్తర్వులు అమలులోకి వస్తాయని రాష్ట్రపతి కార్యాలయం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ప్రస్థానం
రఘుబర్ దాస్ 2014 నుంచి 2019 సంవత్సరం వరకు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. జార్ఖండ్ శాసనసభకు ఐదుసార్లు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించిన నాయకుడు. జార్ఖండ్‌లో తొలి గిరిజనేతర ముఖ్యమంత్రి. శాసనసభకు ఏకంగా 5 సార్లు ఎన్నికయ్యారు.
నిరుపేద కుటుంబంలో జననం
ఆయన 1955వ సంవత్సరం మే 3వ తేదీన భాలుబాసా ప్రాంతంలోని నిరుపేద కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి జంషెడ్‌పూర్‌లో కూలీగా పనిచేసేవాడు. రఘుబర దాస్ ఒకప్పుడు టాటా స్టీల్‌కు చెందిన రోలింగ్ మిల్లులో మజ్దూర్ (కూలీ)గా పనిచేసేవాడు. జంషెడ్‌పూర్‌లోని భాలుబాసా హరిజన్ హైస్కూల్ నుంచి పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత జంషెడ్‌పూర్ కో–ఆపరేటివ్ కాలేజీలో సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తన విద్యార్థి రోజుల్లోనే చురుకై న యూనియన్ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. జంషెడ్‌పూర్ కో–ఆపరేటివ్ కాలేజీలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత న్యాయశాస్త్రంలో ఉత్తీర్ణత సాధించారు. 1976–77 కాలంలో లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ ప్రారంభించిన విద్యార్థి ఉద్యమ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని శ్రీకారం చుట్టారు. ఎమర్జెన్సీ సమయంలో జైలు శిక్ష కూడా అనుభవించారు. 1977 సంవత్సరంలో జనతా పార్టీలో చేరిన రఘుబర దాస్ మూడేళ్ల తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు. 1995 అసెంబ్లీ ఎన్నికల్లో జంషెడ్‌పూర్ (తూర్పు) నుంచి పార్టీ అభ్యర్థిగా నామినేట్ కావడానికి ముందు, భారతీయ జనతా పార్టీలో పలు కీలకమైన సంస్థాగత హోదాల్లో బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు. ఓబీసీ కమ్యూనిటీకి చెందిన రఘుబర దాస్ 1995 నుంచి 2019 వరకు 5 సార్లు జంషెడ్‌పూర్ (తూర్పు) స్థానం గెలుచుకున్నారు. బీజేపీ శాసన సభా పక్ష నాయకుడిగా ఎన్నికై న తర్వాత ఒక కార్మికుడు (మజ్దూర్) సీఎం, పీఎం లేదా రాష్ట్రపతి కావడం అనేది ఒక్క భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యమని ప్రకటించడం విశేషం.
జార్ఖండ్ ఆవిర్భావం నుంచి..
జార్ఖండ్ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించడంతో 2004 సంవత్సరంలో బీజేపీ జార్ఖండ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. బాబూ లాల్ మరాండీ ప్రభుత్వంలో తొలిసారిగా కొత్త రాష్ట్రానికి మంత్రి అయ్యారు. అర్జున్ ముండా నేతృత్వంలో ఏర్పాటైన మంత్రి మండలిలో కూడా రఘుబర దాస్‌కు పదవి లభించడం విశేషం. 2009 సంవత్సరం శిబు సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. దీర్ఘకాల రాజకీయ జీవనంలో ఆర్థిక, కార్మిక మరియు పట్టణాభివృద్ధి శాఖల కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుత ఒడిశా గవర్నర్ ప్రొఫెసర్ గణేషీ లాల్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రొఫెసర్ లాల్ 2018 సంవత్సరం మే 25న గవర్నర్‌గా నియమితులయ్యారు. నాలుగు రోజుల తర్వాత మే 29న ఆయన రాష్ట్ర గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌గా ఆయన పదవీ కాలం ఈ ఏడాది మే నెలలో అధికారికంగా ముగిసింది. తదుపరి గవర్నర్ నియామకం జాప్యం కావడంతో ఇంతవరకు గవర్నర్ హోదాలో కొనసాగారు.
ముఖ్యమంత్రి శుభాకాంక్షలు
ఒడిశా గవర్నర్‌గా నియమితులైన రఘుబర్ దాస్‌ను ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గురువారం అభినందించారు. రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రజల సంక్షేమం కోసం అతనితో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు.
న్యూస్‌రీల్

హైకోర్టు వర్చువల్ బెంచి ప్రారంభిస్తున్న దృశ్యం

స్టేడియంలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న లక్ష్మీ బస్సులు
Comments
Please login to add a commentAdd a comment