24, 25 తేదీల్లో రాష్ట్రపతి పర్యటన
భువనేశ్వర్: ఈ నెల 24న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పర్యటనకు వస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా నయాగడ్, కటక్ జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 24వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటారు. ఆ తర్వాత ఆమె వైమానిక దళ హెలికాప్టర్ ద్వారా నయాగఢ్ జిల్లాకు వెళ్తారు. అనంతరం నయాగడ్ జిల్లాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా కొంటిలో నీల మాధవ ఆలయంలో ప్రార్థనలు చేస్తారు. ఆ తరువాత కలియాపల్లిలోని భారతీయ విశ్వబసు సవర సమాజ్ ఫౌండేషన్ వార్షిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ కార్యక్రమం తర్వాత భువనేశ్వర్‌కు తిరిగివచ్చి రాజ్ భవన్‌లో రాత్రికి బస చేస్తారు. మార్చి 25న భువనేశ్వర్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో కటక్ సందర్శించనున్నారు. కటక్‌లో రెవెన్షా విశ్వ విద్యాలయం 13వ వార్షిక స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ సందర్భంగా రెవెన్షా బాలికల ఉన్నత పాఠశాలలో అభివృద్ధి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మచ్చువా బజార్‌లోని సర్క్యూట్ హౌస్‌లో భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు. ఆ తరువాత తులసీ పూర్‌లోని ఆది కవి సరళ దాస్ విగ్రహానికి నివాళులర్పించి జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ ఆదికవి సరళ దాస్ 600వ జయంతిని పురస్కరించుకుని సరళ సాహిత్య సంసద్ నిర్వహించే కళింగ రత్న అవార్డు 2024 వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ కార్యక్రమం తర్వాత భువనేశ్వర్‌కు తిరిగి వచ్చి సాయంత్రం 5.30 గంటలకు ఢిల్లీకి బయలుదేరుతారు.
Comments
Please login to add a commentAdd a comment