మలిశిరిపూర్‌లో నీటి ఎద్దడి
రాయగడ: జిల్లాలోని బిసంకటక్ సమితి హటోమునిగుడ పరిధి మలిశిరిపూర్ గ్రామంలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. తొమ్మిది నెలలుగా గ్రామంలోని సోలార్ విద్యుత్‌తో నడిచే గొట్టపుబావి మరమ్మతులకు గురవ్వడంతొ మంచినీటి సమస్య తలెత్తింది. దీంతో గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. గ్రామంలో 120 కుటుంబాలకు చెందిన సుమారు 500 మంది జనాభా నివసిస్తోంది. గ్రామస్తుల తాగునీటి సౌకర్యార్ధం జిల్లా యంత్రాంగం ఐదు గొట్టపుబావులు, రెండు సోలార్‌తో నడిచే గొట్టపు బావులను ఏర్పాటు చేసింది. అయితే వీటిలో రెండు గొట్టపు బావులు పూర్తిగా పాడవ్వగా.. సోలార్‌తో నడిచే గొట్టపు బావి కూడా పనిచేయడం లేదు. ఫలితంగా గ్రామస్తులు నీటి వెతలను ఎదుర్కొంటున్నారు. తొమ్మిది నెలలుగా వెంటాడుతున్న నీటి సమస్యను సంబంధిత శాఖ అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేదని గ్రామస్తులు అంటున్నారు. అధికారులు స్పందించి నీటి కష్టాలు తీర్చాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment