దంపతుల గొడవ.. భర్తను హతమార్చిన బంధువులు | - | Sakshi
Sakshi News home page

దంపతుల గొడవ.. భర్తను హతమార్చిన బంధువులు

Published Wed, Dec 27 2023 2:02 AM | Last Updated on Wed, Dec 27 2023 12:56 PM

- - Sakshi

తెనాలిరూరల్‌: స్థానిక కఠెవరంలో భార్యాభర్తల మధ్య గొడవ చివరకు హత్యకు దారి తీసింది. గ్రామానికి చెందిన గేరా వాసు(26) పెయింట్‌ పనిచేస్తుంటాడు. నాలుగేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన వెన్నెలతో ఆయనకు వివాహమైంది. వాసు మద్యానికి బానిసవడంతో ఇరువురి మధ్య రోజూ గొడవలు జరుగుతుండేవి. క్రిస్మస్‌ పండగ సందర్భంగా సోమవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన వాసు అర్ధరాత్రి 12 గంటల సమయంలో భార్యతో ఘర్షణ పడుతు ఆమెను కొడుతుండటాన్ని చూసి భార్య బంధువులు వారించారు. అయినా వినకపోవడంతో గొడవ పెద్దదైంది.

దీంతో భార్య బంధువులు వాసుపై దాడి చేసి స్క్రూ డ్రైవరు, కత్తితో పొడవడంతో తీవ్రంగా గాయడపడ్డాడు. వాసును చికిత్స నిమిత్తం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తుండగా మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. గ్రామానికి చేరుకున్న రూరల్‌ సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గుంటూరు నుంచి వచ్చిన క్లూస్‌ టీం ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నించింది. మృతుడి బంధువుల వద్ద వివరాలు నమోదు చేసుకున్నారు. ఘర్షణలో మృతుడు వాసు మేనమామ తిరుపతిరావుకు కూడా గాయాలయ్యాయని, అతడి ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement