నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ శనివారం నుంచి ప్రారంభం కానుంది. విద్యార్థులలో నైతిక విలువలను, పర్యావరణంపై అవగాహన పెంపొందించేందుకు పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ప్రథమ సంవత్సరం వారికి ఫిబ్రవరి 1వ తేదీన ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్ పరీక్ష నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 3వ తేదీన ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థులు తమ కళాశాలల్లోనే పరీక్ష రాయవలసి ఉంటుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష ఉంటుంది. ఫిబ్రవరి 10 నుంచి 20 వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయి. ఆదివారం సహా ఆయా తేదీలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. థియరీ పరీక్షలు మార్చి 1 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించేలా ఇంటర్ బోర్డు షెడ్యూల్ ప్రకటించింది. అలాగే సమగ్ర శిక్ష ఒకేషనల్ ట్రేడ్ పరీక్షను ఫిబ్రవరి 22న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు.
హాజరు కానున్న 32,434 మంది
ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు 32,434మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ప్రథమ ఏడాదిలో 16,811, ద్వితీయ సంవత్సరంలో 13,749 మంది ఉన్నారు. ఒకేషనల్ ప్రథమ – 1094, ద్వితీయ ఏడాదిలో 780 మంది ఉన్నారు. జనరల్ ప్రాక్టికల్ పరీక్షలకు 11,509 మంది హాజరుకానుండగా.. వీరిలో 9,583 మంది ఎంపీసీ, 1,926 మంది బైపీసీ విద్యార్థులు. ఒకేషనల్ ప్రాక్టికల్స్‌కు 1,094 మంది ప్రథమ, 780 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు హాజరు కానున్నారు.
నేడు ఎథిక్స్, 3న పర్యావరణం పరీక్ష మార్చి ఒకటి నుంచి థియరీ పరీక్షలు
Comments
Please login to add a commentAdd a comment