నేడు కానుకమాత చర్చి తిరునాళ్ల | - | Sakshi

నేడు కానుకమాత చర్చి తిరునాళ్ల

Published Sun, Feb 2 2025 2:04 AM | Last Updated on Sun, Feb 2 2025 2:04 AM

నేడు

నేడు కానుకమాత చర్చి తిరునాళ్ల

రెంటచింతల: ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న కానుకమాత చర్చి 175వ తిరునాళ్ల మహోత్సవానికి సిద్ధమైనట్లు విచారణ గురువులు రె.ఫాదర్‌ ఏరువ లూర్ధుమర్రెడ్డి తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ వేడుకల్లో కులమతాలకు అతీతంగా వేల మంది పాల్గొని కానుకమాత ఆశీస్సులు పొందాలని కోరారు. రె.ఫాదర్‌ జోసఫ్‌ గ్రాండ్‌, కెనడీల ఆధ్వర్యంలో 1850లో సుందరంగా ఈ చర్చి నిర్మించారన్నారు. ఆదివారం ఉదయం 5.30 గంటలకు విచారణ గురువులు ఏరువ లూర్ధుమర్రెడ్డి, సహాయ గురువులు అగస్టీన్‌ మొదటి దివ్యపూజాబలి సమర్పించనున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటలకు గుంటూరు మేత్రాసన పీఠాధిపతులు చిన్నాబత్తిన భాగ్యయ్య, కడప పీఠం అపోస్తలిక పాలనాధికారి డా. గాలి బాలి, నల్గొండ పీఠం విశ్రాంత పీఠాధిపతులు మోస్ట్‌ రెవ.గోవింద్‌ జోజి, 75 మందికి పైగా ఫాదర్లచే పండుగ పవిత్ర సమిష్టి మహోత్సవ దివ్యపూజాబలి నిర్వహించనున్నట్లు చెప్పారు. సాయంత్రం 4 గంటల నుంచి కొవ్వొత్తులు, కానుకల సమర్పణ ఉంటుందని తెలిపారు. రాత్రి 10 గంటల నుంచి పురవీధులలో తేరు ప్రదక్షిణ ఉంటుందన్నారు. జెయింట్‌ వాల్స్‌, బ్రేక్‌డాన్స్‌, రంగులరాట్నాలు, అంగళ్లు ఏర్పాటు చేశారని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
నేడు కానుకమాత చర్చి తిరునాళ్ల 1
1/1

నేడు కానుకమాత చర్చి తిరునాళ్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
 
Advertisement