నాటికలకు సమాజమే ఇతివృత్తం
నరసరావుపేట ఈస్ట్: నరసరావుపేట రంగస్థలి 45వ వార్షికోత్సవంలో భాగంగా రాష్ట్ర భాషా సంస్కృతిక శాఖ, రంగస్థలి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 24వ జాతీయస్థాయి తెలుగు ఆహ్వాన నాటిక పోటీలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. రెండవరోజు శనివారం నాటిక పోటీలను రంగస్థలి శాశ్వత సభ్యులు నాతాని సురేఖా వెంకటేశ్వర్లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. హైదరాబాద్ కళాంజలి వారి అన్నదాత, వెలగలేరు థియేటర్ ఆర్ట్స్, వెలగలేరు వారి రాత నాటికలను ప్రదర్శించారు. రంగస్థలి అధ్యక్షుడు షేక్.మహబూబ్ సుభాని, కిలారు వెంకటరావు, ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్రబోస్, కార్యనిర్వహణ కార్యదర్శి ఏ.ఏ.మధుకుమార్ తదితరులు పర్యవేక్షించారు.
అన్నదాత కడగండ్లకు కారకులెవరు?
వ్యవసాయదారుని కడగండ్లు ఇతివృత్తంగా రూపుదిద్దుకున్నది అన్నదాత నాటిక. అన్నం పెట్టే రైతు నోట్లో అందరూ మట్టి కొట్టేవాళ్లే.. ప్రకృతి వైపరీత్యాలతో పోరాడే రైతును పాలకులు, దళారులు, వ్యాపారులు అందరూ మోసం చేస్తూ రైతు జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నారు. రైతు కష్టాలను కళ్లకు కట్టింది.
మన రాత మనమే రాసుకుంటాం...
మనిషికి కష్టం వస్తే నా రాతింతే అని తల పట్టుకొని కూచుంటాడు. సంతోషం కలిగితే పరిసరాలను పట్టించుకోడు. మనిషి నైజం వల్ల ప్రస్తుత సమాజంలో ఏం జరుగుతోంది.. సమాజం ఎటువైపు పోతుంది.. ప్రకృతి అనర్థాలకు కారకులెవరు వంటి ప్రశ్నలకు ప్రతి ఒక్కరే తమకు తామే సమాధానం ఇచ్చికునే పరిస్థితిని కళ్లకు కట్టినట్టుగా రాత నాటిక ప్రేక్షకులను ఆలోచింప చేసింది.
మళ్లీ విజృంభించిన వేటపాలెం ఎడ్లు
మాచవరం: మండల కేంద్రమైన మాచవరంలో లక్ష్మితిరుపతమ్మగోపయ్య స్వామి వార్ల కల్యాణోత్సవం సందర్భంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు బల ప్రదర్శన పోటీల్లో భాగంగా న్యూ కేటగిరి (సేద్యం) విభాగంలో బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెం గ్రామానికి చెందిన అత్తోట శిరీషా చౌదరి శివకృష్ణ చౌదరి ఎడ్లు 3770.9 అడుగుల దూరాన్ని లాగి మొదటి స్థానంలో నిలిచాయి. వజ్రాల తేజశ్వినీరెడ్డి (సంతమాగులూరు, బాపట్ల జిల్లా) ఎడ్లు 3250 అడుగులు దూరాన్ని లాగి రెండవ స్థానంలో, సంపటం వీరబ్రహ్మం నాయుడు (క్రోసూరు, పల్నాడు జిల్లా) ఎడ్లు 3149.7 అడుగులు దూరాన్ని లాగి మూడవ స్థానంలో, తనుబొద్ది శంకర్‌రెడ్డి (ఉప్పమాగులూరు, బల్లకురవ మండలం, ప్రకాశం జిల్లా) ఎడ్లు 2798.6 దూరాన్ని లాగి నాల్గవ స్థానంలో, ముక్కపాటి హనుమంతురావు చౌదరి (మాచవరం, పల్నాడు జిల్లా) ఎడ్లు ఐదో స్థానంలో, సిద్ది మల్లేశ్వరావు (మర్రివేముల, పుల్లలచెరువు, ప్రకాశం జిల్లా) ఎడ్లు 2567.3 అడుగులు దూరాన్ని లాగి ఆరో స్థానంలో బహుమతులు అందుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment