ఎమ్మెల్సీ ఎన్నికలపై శిక్షణ
నరసరావుపేట: ఈనెల 27వ తేదిన శాసనమండలి ఎన్నికల పోలింగ్ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహించనున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి.అరుణ్‌బాబు చెప్పారు. సోమవారం కలెక్టరేట్‌లోని గుర్రం జాషువా సమావేశ మందిరంలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లకు పోలింగ్ నిర్వహణపై శిక్షణ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ బ్యాలెట్ బాక్సుల నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలని అధికారులకు సూచించారు. మొత్తం 25 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని వివరించారు. మొత్తం 38 ప్రదేశాలలో 90 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 600 మంది పోలింగ్ సిబ్బందిని నియమించామని వివరించారు. కట్టుదిట్ట పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్ జరుగుతుందని వెల్లడించారు. ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్‌గా నరసారావుపేటలోని ఎస్‌ఎస్‌ఎన్ కాలేజీని ఎంపిక చేసినట్టు వివరించారు. శిక్షణలో జిల్లా రెవెన్యూ అధికారి ఐ.మురళి, మాస్టర్ ట్రైనర్లు పూర్ణచంద్రరావు, అరుణ్, ఎంవీ వెంకటరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment