పారిశుద్ధ్య సేవలు ప్రైవేటుకు అప్పజెప్పొద్దు
నరసరావుపేట: జీఓవెంటనే 279ని సత్వరం రద్దు చేసి ప్రైవేట్ కంపెనీలకు పారిశుద్ధ్య సేవలు అప్పజెప్పే విధానాన్ని విడనాడాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కాసా రాంబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరేకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ గతంలో అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం తక్షణమే సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. లేనిపక్షంలో ఈనెల 11న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించి లక్షలాదిగా తరలివెళ్తామన్నారు. ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఉప్పలపాటి రంగయ్య, వైదన వెంకట్, దాసరి రాజు, జయరాజు, వరహాలు, వందనం, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ నేతలు, కార్మికుల ధర్నా
Comments
Please login to add a commentAdd a comment