తప్పు చేశా.. క్షమించండి
దాచేపల్లి : పింఛన్‌దారుల డబ్బులు తీసుకుని పరారీలో ఉన్న దాచేపల్లి నగర పంచాయతీలోని వార్డు సచివాలయం–3 వెల్ఫేర్ కార్యదర్శి సంపతి లక్ష్మీప్రసాద్ సామాజిక మాధ్యమాల్లో మంగళవారం పొస్ట్‌చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో డబ్బులు పెట్టి మోసపోయాను. నెలరోజులు గడువు ఇస్తే డబ్బులు చెల్లిస్తా.. అంటూ ఆ వీడియోలో చెప్పాడు. ఇంకా ఆ వీడియోలో ఏమి చెప్పడంటే.. ‘‘సార్.. ఆన్‌లైన్ బెట్టింగ్‌లు పెట్టి ఎన్నో డబ్బులు పొగొట్టుకున్నా. గవర్నమెంట్ డబ్బులు కూడా ఆన్‌లైన్ బెట్టింగ్‌లో పెట్టి మోసపోయా. నేను తప్పు చేశానని ఈ రోజు అర్ధమైంది. కలెక్టర్ గారు, కమిషనర్ గారు నేను తప్పు చేశా. నన్ను క్షమించండి. ఒక నెల నాకు అవకాశం ఇస్తే తల్లిదండ్రులను బతిమాలుకుని నేను తీసుకున్న డబ్బులను చెల్లిస్తా. నేను చేసిన తప్పు వల్ల నా భార్య పిల్లలతో రోడ్డుపై పడ్డా. పిల్లలు రెండు రోజుల నుంచి ఏమీ తినలేదు. ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. నా తప్పు తెలుసుకున్నా. ఒక్క అవకాశం ఇప్పించండి. ఇంకోసారి ఇటువంటి తప్పు చేయను. నా భార్య పిల్లలతో కలిసి సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాం. సార్ మమ్మల్ని క్షమించండి’’ అంటూ ఆ వీడియోలో లక్ష్మీప్రసాద్ చెప్పాడు. ఫిబ్రవరి 28న బ్యాంక్ నుంచి డ్రా చేసిన రూ.8.23 లక్షల పింఛన్ డబ్బులతో లక్ష్మీప్రసాద్ పారిపోయిన విషయం తెలిసిందే. ఇతనిపై కమిషనర్ ఎంవీ అప్పారావు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో దర్యాప్తు చేపట్టారు. తాజాగా లక్ష్మీప్రసాద్ తాను మాట్లాడిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పొస్ట్ చేయటంతో అతని ఆచూకీ కనుగొనేందుకు నగర పంచాయతీ అధికారులు, పోలీసులు యత్నిస్తున్నారు.
ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లు పెట్టి మోసపోయా నెల రోజుల్లో పింఛన్ డబ్బులు చెల్లిస్తా పరారైన సచివాలయ వెల్ఫేర్ కార్యదర్శి లక్ష్మీప్రసాద్.
Comments
Please login to add a commentAdd a comment