రేపటి నుంచి గుడారాల పండగ
అమరావతి: ఏటా నిర్వహించే గుడారాల పండగను ఈ ఏడాది గుంటూరు శివారులోని గోరంట్లలో కాకుండా మండల పరిధిలోని లేమల్లె గ్రామంలో నిర్వహించటానికి అన్ని ఏర్పాట్లనూ పూర్తిచేశామని హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షుడు అబ్రహం చెప్పారు. మంగళవారం లేమల్లెలోని హోసన్నా దయాక్షేత్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ హోసన్నా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు ఏసన్నా తొలుత లేమల్లె గ్రామంలో హోసన్నా మందిరం నిర్మాణం చేసిన ప్రదేశంలో సుమారు 25 ఏళ్ల తర్వాత 48వ గుడారాల పండగ నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఈనెల 6,7,8,9 తేదీలలో జరిగే ఈ పండగకు విశ్వాసులు తరలిరావాలని కోరారు. ఆర్టీసీ గుంటూరు నుంచి ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నట్టు వెల్లడించారు. ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. పోలీసు శాఖ బందోబస్తును పర్యవేక్షిస్తుందని వెల్లడించారు. రాయలసీమ, భీమవరం, అనకాపల్లి తదితర ప్రాంతాల నుంచి గుంటూరుకు వచ్చే రైళ్లలో 15 ప్రత్యేక కోచ్‌లను గుడారాల పండగ కోసం ఏర్పాటు చేయడం విశేషమని పేర్కొన్నారు. ఐదో తేదీ బుధవారం సాయంత్రం హోసన్నా దయాక్షేత్రంలో కొత్తగా నిర్మించిన చర్చి ప్రారంభోత్సవం జరగనుందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment