
కీబోర్డులో నులకపేట విద్యార్థి గిన్నిస్ రికార్డు
తాడేపల్లి రూరల్ : స్థానిక నులకపేటకు చెందిన ఓ విద్యార్ధిని మ్యూజికల్ కీ బోర్డులో రికార్డు సృష్టించి గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించింది. మంగళవారం గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డు సంస్థ సర్టిఫికెట్‌ను అందసింది. నులకపేటకు చెందిన చల్లా కరుణాకర్ రెడ్డి, ఉషశ్రీ దంపతుల కుమార్తె చల్ల వ్యూహిత కేంద్రీయ విద్యాలయ గుంటుపల్లి కేవీ2లో 10వ తరగతి చదువుతోంది. ఇన్‌స్ట్రాగామ్‌లో ఒక గంటలో అత్యధికంగా 1,046 కీబోర్డు వాయిద్యం వీడియోలు అప్‌లోడ్ చేసి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్, విజయవాడలోని మిస్టర్ అగస్టీన్ దండింగి వేణుగోపాల్, హాలెల్ మ్యూజిక్ స్కూల్ ద్వారా డిసెంబర్ 1, 2024న ఈ ఘనతను సాధించింది.

కీబోర్డులో నులకపేట విద్యార్థి గిన్నిస్ రికార్డు