
● 31రోజులకు చేరిన పారిశుద్ధ్య కార్మికుల నిరసన దీక్షలు ●
26 నుంచి స్లాట్ల ద్వారా రిజిస్ట్రేషన్‌లు
అమరావతి: ఈనెల 26వ తేదీ నుంచి అమరావతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోని అన్ని గ్రామాలలో పొలాలు, స్థలాలు రిజిస్ట్రేషన్ చేయించుకోవటానికి స్లాట్ విధానం ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిందని అమరావతి సబ్ రిజిస్ట్రార్ పి.వెంకటరెడ్డి తెలిపారు. శనివారం అయన రిజిస్ట్రేషన్ స్లాట్ల విధానం గురించి వివరిస్తూ అమరావతి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి రోజుకు 39 స్లాట్‌లను కేటాయించారని తెలిపారు. ఈ స్లాట్ల బుకింగ్ చేసుకోవటానికి ఆన్‌లైన్‌లో ఐజీఆర్‌ఎస్ స్లాట్‌లో బుకింగ్ చేసుకోవాలన్నారు. ప్రతిరోజు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు స్లాట్ బుకింగ్ చేసుకున్న వారికి రిజిస్ట్రేషన్‌లు చేస్తామన్నారు. అలాగే స్లాట్ బుకింగ్ చేసుకోని వారికి సాయంత్రం 5గంటల తర్వాత రిజిస్ట్రేషన్‌లు నిర్వహిస్తామన్నారు. ఈ స్లాట్ బుకింగ్ వల్ల కాలం వృథా కాకుండా క్రమ పద్ధతిలో రిజిస్ట్రేషన్‌లు జరుగుతాయన్నారు. ప్రజలంతా ఈ రిజిస్ట్రేషన్ స్లాట్ విధానాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.
వాటర్ ట్యాంకర్‌ను ఢీకొన్న కంటైనర్
తమిళనాడుకు చెందిన డ్రైవర్‌కు తీవ్రగాయాలు
యడ్లపాడు: హైవే సెంట్రల్ డివైడర్‌పై మొక్కలకు నీరు పొస్తున్న వాటర్ ట్యాంకర్‌ను కంటైనర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలైన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ టి శివరామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..తమిళనాడు చెందిన కంటైనర్ గుంటూరు నుంచి చిలకలూరిపేట వైపు వస్తున్న క్రమంలో యడ్లపాడు మండలం బోయపాలెంలోని కళ్యాణ వెంకటేశ్వరస్వామి గుడి సమీపంలో హైవేపై మొక్కలకు నీళ్లు పోస్తున్న వాటర్ ట్యాంకర్‌ను వెనుక నుండి ఢీకొట్టింది. సాయంత్రం 4 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో కంటైనర్ లారీ ముందుభాగం పూర్తిగా ధ్వంసం కాగా, డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కార్మికుల పోరాటాన్ని పట్టించుకోకపోవటం దారుణం
నరసరావుపేట: ఆప్కాస్‌లో ఉన్న తమకు పనిచేసిన రోజులు అన్నింటికి జీతం చెల్లించాలని కోరుతూ 30 రోజులుగా పారిశుద్ధ్య కార్మికుల చేస్తున్న పోరాటాన్ని కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవటం దారుణమని కుల నిర్మూలన పోరాట సమితి (కేఎన్‌పీఎస్) రాష్ట్ర కార్యదర్శి కె.కృష్ణ పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట తమ డిమాండ్ల సాధనకోసం కార్మికులు చేస్తున్న నిరసన దీక్షలు శనివారంతో 31వ రోజుకు చేరాయి. శిబిరాన్ని కృష్ణ సందర్శించి కార్మికులకు సంఘీభావం తెలియచేసి మాట్లాడారు. ప్రభుత్వం ఎవరికోసం పనిచేస్తుందో అర్ధంకావట్లేదన్నారు. తాము అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు తీరుస్తామని ప్రజలకు పలు వాగ్దానాలు చేసిన కూటమి నాయకులు తమకు నెలజీతం ఇప్పించమని కోరుతున్న కార్మికులవైపు చూడకపోవటం వారి నైజం తెలియచేస్తుందన్నారు. కార్మికులు చేస్తున్న పోరాటానికి తమ సంఘం పూర్తిగా మద్దతు తెలియచేస్తుందన్నారు. వెంటనే అధికారులు కలుగుచేసుకొని వారికి పూర్తిజీతంతో పాటు విధుల్లోకి తీసుకోవాలని కోరారు.
ఉత్సాహంగా జాతీయ స్థాయి ఎడ్ల పోటీలు
మార్కాపురం టౌన్: మార్కాపురం లక్ష్మీచెన్నకేశవస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్థానిక ఎస్‌వీకేపీ కళాశాలలో జరుగుతున్న జాతీయ స్థాయి ఎడ్ల పోటీలు 2వ రోజైన శనివారం ఉత్సాహంగా సాగాయి. పోటీలకు గుంటూరు, నంద్యాల, బాపట్ల, తెలంగాణలోని సూర్యాపేట, పల్నాడు, ప్రకాశం జిల్లాల నుంచి ఎడ్ల జతలు పోటీల్లో పాల్గొన్నాయి. శనివారం పోటీల్లో గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పెద్దగొట్టిపాడు గ్రామానికి చెందిన జీఎల్‌ఆర్ గ్రూప్స్, గరికపాటి లక్ష్మయ్యచౌదరిలకు చెందిన ఎడ్ల జత 4351.06 అడుగుల దూరం లాగి ప్రథమ బహుమతిని, నంద్యాల జిల్లా పెద్దకొట్టాలకు చెందిన బీ కేశవరెడ్డికి చెందిన ఎడ్ల జత 4325.09 అడుగుల దూరంలాగి రెండో స్థానాన్ని, బాపట్ల జిల్లా వేటపాలెం మండలం చుండూరుకు చెందిన ఆర్‌కె బుల్స్, శిరీషా చౌదరికి చెందిన ఎడ్ల జత 4291.10 అడుగులు లాగి మూడో బహుమతిని, తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన జే సహస్రయాదవ్, జేవీఎల్ యాదవ్‌కు చెందిన ఎడ్ల జత 3881.10 అడుగులు లాగి 4వ స్థానాన్ని సాధించాయి.
జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ప్రేమయ్య ఎంపిక
ఇంకొల్లు(చినగంజాం) జాతీయ స్థాయిలో నిర్వహించే టీ 20 క్రికెట్ పోటీలకు మండలంలోని నాగండ్ల గ్రామానికి చెందిన బూరగ ప్రేమయ్య ఎంపికయ్యారు. ఈ మేరకు ప్రేమయ్యకు ఆల్ ఇండియా క్రికెట్ డవలప్‌మెంట్ ట్రస్టు నుంచి ఉత్తర్వులు అందాయి. జాతీయ జట్టులో భారతదేశం తరపున క్రికెట్ జట్టులో ప్రేమయ్య బ్యాట్స్‌మన్ ఎంపిక కాగా మే నెల 26 నుంచి 31 వరకు నేపాల్‌లో నిర్వహించే పోటీలలో పాల్గొనున్నట్లు ప్రేమయ్య తెలిపారు. ప్రేమయ్య ప్రస్తుతం నరసరావు పేటలో కృష్ణవేణి డిగ్రీ కాలేజీ నందు డిగ్రీ చదువుతున్నాడు.
చికిత్స పొందుతూ క్షతగాత్రుడు మృతి
చీరాల: టూవీలర్‌ను లారీ ఢీకొనడంతో తీవ్రగాయాలై హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వ్యక్తి శనివారం మృతిచెందాడు. ఈనెల 16న పాపాయిపాలెంకు చెందిన రమేష్ బైపాస్ రోడ్డులో వెళుతుండగా లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఒంగోలు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న అతడు శనివారం మృతిచెందాడు. టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

● 31రోజులకు చేరిన పారిశుద్ధ్య కార్మికుల నిరసన దీక్షలు ●

● 31రోజులకు చేరిన పారిశుద్ధ్య కార్మికుల నిరసన దీక్షలు ●

● 31రోజులకు చేరిన పారిశుద్ధ్య కార్మికుల నిరసన దీక్షలు ●

● 31రోజులకు చేరిన పారిశుద్ధ్య కార్మికుల నిరసన దీక్షలు ●