
జేఈఈ మెయిన్స్‌లో 110వ ర్యాంకు
మాచర్ల రూరల్: మాచర్ల మండలం హసనాబాద్ తండాకు చెందిన కేతావత్ దిగేశ్వర్ నాయక్ ఆల్ ఇండియా లెవల్‌లో జేఈఈ మెయిన్స్‌లో 110వ ర్యాంకు సాధించినట్లు తండ్రి కేతావత్ రూప్లానాయక్ ఆదివారం తెలిపారు. విజయవాడలోని పోరంకిలో నారాయణ కాలేజీలో విద్యనభ్యసిస్తున్న దిగేశ్వర్ నాయక్ ఆల్ ఇండియా స్థాయిలో 110 వ ర్యాంకు సాధించటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అలరించిన లఘు నాటికల ప్రదర్శన
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): స్థానిక బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై ఆదివారం సాయంత్రం గుంటూరు హ్యూమర్ క్లబ్ 12వ వార్షికోత్సవాలు జరిగాయి. ఆలయ కమిటీ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, సంస్థ సభ్యులు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. వేడుకలకు సంస్థ ఉపాధ్యక్షులు మధువని అధ్యక్షత వహించారు. అనంతరం ఓర్నీ, పోవోయి అనుకోని అతిథి లఘు నాటికలు ప్రదర్శించారు. ఇవి సభికులను అలరించాయి. దర్శకులు గుడివాడ లహరి, సీహెచ్.అమృతవర్షిణి, క్లబ్ వ్యవస్థాప కార్యదర్శి షేక్ లాల్‌వజీర్, కార్యదర్శి అత్తలూరి నాగజ్యోతిలు ప్రసంగించారు. నటీనటులు మధువని, నాగజ్యోతి, ప్రత్తిపాటి మంగయ్య, డాక్టర్ ఎన్‌వీకృష్ణప్రసాద్, గుడివాడ లహరి, ఎ.రాజశేఖర్, పెండ్యాల రమేష్‌బాబు, ప్రదీప్‌కుమార్, ఎం.క్రిష్ణకిషోర్ తమ పాత్రల్లో నటించి ప్రేక్షకులను నవ్వుల్తో ముంచెత్తారు.
అక్కడ అబ్బాయి.. ఇక్కడ అమ్మాయి
ెపెదవడ్లపూడి(మంగళగిరి) : ప్రేమించుకున్న జర్మనీ అబ్బాయి ఆంధ్రా అమ్మాయి ఇరు కుటుంబాల అంగీకారంతో ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరికి సమీపంలోని పెదవడ్లపూడిలో ఒక్కటయ్యారు. వీరి వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం వైభవంగా జరిగింది. పెదవడ్లపూడికి చెందిన సుందర్శనం రవికుమార్, లక్ష్మీ దంపతుల కుమార్తె మౌనిక జర్మనీలో పీహెచ్‌డీ చేస్తూ ఉద్యోగం చేస్తున్నారు. అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న జర్మనీకి చెందిన ఫాబియన్ డువెన్ బేక్‌తో పరిచయమై అది ప్రేమగా మారింది. దీంతో ఇరువురూ తమ ఇళ్ళల్లో తల్లిదండ్రులకు తెలియజేసి అందరి అంగీకారంతో పెదవడ్లపూడి సాయిబాబా ఆలయంలో వైభవంగా వివాహం చేసుకున్నారు.

జేఈఈ మెయిన్స్‌లో 110వ ర్యాంకు

జేఈఈ మెయిన్స్‌లో 110వ ర్యాంకు