
జమ్మూకశ్మీర్‌లో మానవత్వంపై దాడి
చిలకలూరిపేట: జమ్మూకశ్మీర్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి మానవత్వంపై జరిగినట్టేనని, ఇలాంటి వాటిని సభ్య సమాజం హర్షించదని ముస్లిం జేఏసీ నాయకులు చెప్పారు. పహల్గాంలో ఉగ్రదాడిని నిరసిస్తూ, మృతుల ఆత్మ శాంతించాలని కోరుతూ పట్టణంలోని కళామందిర్ సెంటర్‌లో ఉన్న మర్కస్ మసీదు వద్ద శుక్రవారం ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం ఏర్పాటు చేశారు. ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ ముష్కరుల చేతిలో అమాయక ప్రజలు మృతి చెందడం తీవ్ర విషాదకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కార్యక్రమంలో ముఫ్తీ అనస్‌ఖాన్, మౌలానా అబ్బాస్‌ఖాన్, షేక్ జాన్‌సైదా, షేక్ అబ్దుల్ జబ్బార్, మొహమ్మద్ యూసుఫ్ అలీ, సీపీఐ సుభాని, షేక్ బాజి, అంజుమన్ అహమ్మద్, సయ్యద్ బడే తదితరులు పాల్గొన్నారు.
నిరసన కార్యక్రమంలో ముస్లిం జేఏసీ నాయకులు మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన