
పల్నాడు యువతులకు గిన్నిస్ రికార్డులో చోటు
పిడుగురాళ్ల రూరల్: పిడుగురాళ్ల మండలంలోని జూలకల్లు గ్రామానికి చెందిన యువతులు గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించారు. విజయవాడలోని హలెల్ మ్యూజిక్ స్కూల్ మాస్టర్ బి. అగస్టీన్ సారథ్యంలో 2024 డిసెంబర్ 1న 18 దేశాల నుంచి ఒకేసారి 1,090 మంది కళాకారులు కీ బోర్డును ప్లే చేసి ఇన్‌స్ర్ట్రాగామ్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో ప్రపంచ రికార్డును సాధించడంతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కింది. అందులో పాల్గొన్న 1,046 మందికి ఏప్రిల్ 25న విజయవాడ గుణదల మెట్రోపాలిటిన్ మిషన్ చర్చిలో ధ్రువపత్రాలు అవార్డులను పంపిణీ చేశారు. అందులో జూలకల్లు గ్రామానికి చెందిన ఇనుముక్కల కవిత, ఇనుముక్కల కోటేశ్వరికి ఈ రికార్డులో చోటు దక్కడంతో సర్టిఫికెట్, అవార్డును అందుకున్నారు. వీరిద్దరు పాస్టర్ బంకా సురేష్ సహకారంతో ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో పాల్గొన్నట్లు తెలిపారు. కవిత, కోటేశ్వరిలను గ్రామ ప్రజలు, చర్చి సంఘ పెద్దలు అభినందించి, సన్మానించారు.

పల్నాడు యువతులకు గిన్నిస్ రికార్డులో చోటు