నేడు శంబర పోలమాంబ అమ్మవారి నాలుగవ జాతర
మక్కువ: ఉత్తరాంధ్రు ఇలవేల్పు శంబరపోలమాంబ అమ్మవారి నాలుగవ జాతర మంగళవారం జరగనుంది. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యం నిమిత్తం ఈవో వీవీ సూర్యనారాయణ, సీఐ రామకష్ణ, ఎస్సై వెంకటరమణ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పా ట్లు నిర్వహించారు. జాతరకు వచ్చే భక్తులకు పులిహార, లడ్డూ ప్రసాదాన్ని అందించేందుకు చర్యలు చేపట్టా రు. నాలుగవ జాతరలో సుమారు 70 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు.
స్వచ్ఛసుందర పురంగా తీర్చిదిద్దుదాం
పార్వతీపురం: అందుబాటులో ఉన్న వనరుల తో పార్వతీపురాన్ని స్వచ్ఛసుందర పురంగా తీర్చిదిద్దుదామని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ అన్నా రు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో చెత్త నుంచి సంపదను సృష్టించేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. చెత్తను సేకరించేందుకు మున్సిపాల్టీ, సచివాలయ సిబ్బందిని వినియోగించాలన్నారు. చెత్త నుంచి సంపద సృష్టించేందుకు మార్చి 1 నుంచి మాస్టర్ ట్రైనీలతో శిక్షణ ఇప్పించాలన్నారు. సమావేశంలో ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ, డీఆర్‌ఓ కె. హేమలత, మున్సిపల్ కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వరులు, డీఆర్‌డీఏ పీడీ వై.సత్యంనాయుడు, డుమా పీడీ కె.రామచంద్రరావు, జట్టు ఆశ్రమం సభ్యులు వి.పద్మజ, డీఎల్‌డీఓ రమేష్‌రామన్, తదితరులు పాల్గొన్నారు.
విలేకరిపై దాడి తగదు
విజయనగరం: పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ ప్రజాశక్తి విలేఖరిపై టీడీపీ నాయకుడి దాడిని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు సోమవారం ఓ ప్రకటన లో ఖండించారు. ప్రజాస్వామ్య మనుగడకు మూలాధారమైన పత్రికా వ్యవస్థపై దాడి సమంజసం కాదన్నారు. వ్యతిరేక వార్తలు రాసి నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా వివరణ ఇవ్వాలని, లేదంటే ప్రకటన ద్వారా ఖండించాలే తప్ప భౌతికదాడులు సరైన మార్గం కాదన్నా రు. ఇలాంటి సంఘటనలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు వంటివని పేర్కొన్నారు. బాధిత పాత్రికేయులకు అన్ని విధాల అండగా నిలుస్తా మని ఆయన ప్రకటించారు.
అంతర్జాతీయ సహకార
సంవత్సరంగా–2025
పార్వతీపురం: అంతర్జాతీయ సహకార సంవత్సరంగా–2025ను ఐక్యరాజ్యసమితి ప్రకటించిందని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సోమవారం నిర్వహించిన జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సుస్థిర ఆర్థికాభివృద్ధి మెరుగైన ప్రపంచాన్ని నిర్మిస్తుందనే నినాదంతో సహకార సంవత్సరం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సంవత్సర కాలంలో ప్రాథమిక సహకార సంఘాలను బలోపేతం చేయాలని, వాటికి గ్రేడింగ్ ఇవ్వాలని సూచించారు. ప్రాథమిక సహకార సంఘాల వ్యాపార కార్యకలాపాల విస్తరణ జరగాలన్నారు. మత్స్య, చేనేత, గొర్రెల పెంపకం సంఘాలను ఏర్పాటు చేసి వాటి అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు. జిల్లా సహకార అధికారి పి.శ్రీరామమూర్తి మాట్లాడుతూ సహకార సంఘాలలో నిర్వహించే కార్యక్రమాల షెడ్యూల్‌ను విడుదల చేశామన్నారు. జిల్లాలో బాగా పనిచేస్తున్న సహకార సంఘాలను గుర్తించి ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామని తెలిపారు. సమావేశంలో నాబార్డు జిల్లా అభివృద్ధి అధికారి డి.ఎస్.దినేష్ కుమార్ రెడ్డి, విజయనగరం, శ్రీకాకుళం డీసీసీబీల జనరల్ మేనేజర్లు కేవీవీఆర్‌ఎన్.సత్యనారాయణ, ఎస్‌వీఎస్ జగదీష్, శ్రీకాకుళం జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఎల్‌ఎన్‌బీ శ్రీధర్ రాజా, తదితరులు పాల్గొన్నారు.
నేడు శంబర పోలమాంబ అమ్మవారి నాలుగవ జాతర
నేడు శంబర పోలమాంబ అమ్మవారి నాలుగవ జాతర
Comments
Please login to add a commentAdd a comment