వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
● ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి
పార్వతీపురంటౌన్: పోలీస్ సిబ్బంది మెరుగైన సేవలందించేందుకు వీలుగా వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా సాయుధ పోలీసులకు 15 రోజుల పాటు నిర్వహించే పునశ్చరణ తరగతులను పార్వతీపురం జూనియర్ కళాశాల మైదానంలో సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఆర్ సిబ్బందికి ఏటా మొబిలైజేషన్ కార్యక్రమంలో భాగంగా విధుల్లో నైపుణ్యం, ఫిజికల్ ఫిట్‌నెస్‌ను మెరుగుపరిచే శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసులు జిల్లా పోలీస్ శాఖకు వెన్నెముఖగా నిలుస్తున్నారన్నారు. యోగా, వ్యక్తిత్వ వికాసం, ఆరోగ్యం, ఆర్థిక స్థితులను మెరుగుపర్చేందుకు ప్రణాళికాయుతంగా కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. పోలీస్ సంక్షేమ కార్యక్రమాల పై అవగాహన కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ థామస్‌రెడ్డి, ఆర్‌ఐలు నాయుడు, రాంబాబు, శ్రీనివాసరావు, ఆర్‌ఎస్‌ఐలు, పలువురు ఏఆర్‌ఎస్‌ఐలు, ఏఆర్‌హెచ్‌సీలు, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment