●మాకు తెలియకుండానే ఉద్యోగుల తొలగింపు
ఉపాధిహామీలో క్షేత్రస్థాయి అధికారులను తీర్మానం లేకుండా తొలగిస్తున్నారు.. మా మండలంలో ఉపాధిహామీ క్షేత్రసహాయకులను ఏడుగురిని కూటమి ప్రభుత్వం తొలగించింది. ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేయడం లేదు. సర్పంచ్‌ల హక్కులు కాలరాస్తున్నారు. అభివృద్ధి పనులకు సర్పంచ్‌ల మాటలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. పంచాయతీల హక్కులను కాలరాస్తున్నారు. పంచాయతీల ప్రథమ పౌరులుగా మా బాధ్యతలను మాకు అప్పగించాలి. అందుకే పంచాయతీల ప్రెసిడెంట్‌లంతా ఈ రోజు కలెక్టర్‌ను కలవడానికి వచ్చాం.
– రమేష్, శిఖబడి సర్పంచ్,
జియ్యమ్మవలస మండలం
Comments
Please login to add a commentAdd a comment