భూముల రీ సర్వే వేగవంతం చేయాలి
సీతంపేట: భూముల రీ సర్వేను వేగవంతం చేయాలని ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి వీఆర్వోలను ఆదేశించారు. ఐటీడీఏలోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో వీఆర్వోలు, వీఏఏలతో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రీ సర్వేలో సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. గృహనిర్మాణాలకు సంబంధించిన ల్యాండ్ పొజిషన్ సిర్టిఫికెట్లను వెంటనే మంజూరుచేయాలని సూచించారు. ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేసేలా లబ్ధిదారులను చైతన్యవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ అప్పలరాజు, ఎంపీడీఓ గీతాంజిలి, మండల వ్యవసాయాధికారి శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.
కుంకి ఏనుగుల నివాస స్థలం పరిశీలన
సీతానగరం: పార్వతీపురం మన్యం జిల్లాలో సంచరిస్తున్న ఏనుగుల గుంపును తరలించడానికి తీసుకురానున్న కుంకి ఏనుగుల నివాసానికి అసరమైన స్థల ఏర్పాట్లను రాష్ట్ర అటవీశాఖ ముఖ్య కన్జర్వేటర్ శాంతిప్రియ పాండే మంగళవారం పరిశీలించారు. ఈ మేరకు సీతానగరం మండలంలోని జోగింపేట కొండ ప్రాంతంలో కుంకి ఏనుగుల కోసం ఏర్పాటు చేసిన స్థావరాలను ఆమె తనిఖీ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం నియోజకవర్గంలో ఏడు ఏనుగుల గుంపు, పాలకొండ నియోజకవర్గంలో నాలుగు ఏనుగుల గుంపు వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం గమనించి వాటిని తరలించడానికి ఏర్పాట్లు చేస్తోందని ఆమె తెలియజేశారు. ఇందులో భాగంగా కుంకి ఏనుగులను తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించి కొంతమంది అటవీశాఖ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామ న్నారు. కార్యక్రమంలో సీఎఫ్‌ఓ మైడి దివాన్, జిల్లా అటవీశాఖఅధికారి ప్రసూన, ఎఫ్‌ఆర్‌ఓ రామం నరేష్, ఎస్‌ఎఫ్‌ఓ మనోజ్‌కుమార్, బీట్ ఆఫీసర్ రిషి పాల్గొన్నారు.
మార్చి 8న జాతీయ లోక్‌అదాలత్
● వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి
సాయికళ్యాణ్ చక్రవర్తి
విజయనగరం లీగల్: వచ్చేనెల 8వ తేదీన జరగనున్న జాతీయ లోక్‌అదాలత్‌ను వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవా సంస్థ చైర్మన్ బి.సాయికళ్యాణ్ చక్రవర్తి పిలుపునిచ్చారు. ఉమ్మడి విజయనగరం జిల్లాల్లోని న్యాయమూర్తులతో మంగళవారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. రాజీపడదగిన క్రిమినల్, మోటారు ప్రమాద బీమా, బ్యాంకు, చెక్కుబౌన్స్, ప్రాంసిరీ నోట్, పర్మినెంట్ ఇంజక్షన్ దావాలు, ఎగ్జిక్యూషన్ పిటిషన్, ఎలక్ట్రిసిటీ కేసులు, ఎకై ్సజ్, భూములు, కుటుంబ తగాదాలు, వాటర్, మున్సిపాలిటీ, ప్రి లిటిగేషన్ కేసులను ఇరుపార్టీల అనుమతితో రాజీమార్గంలో శాశ్వత పరిస్కారం చూపాలని కోరారు. కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తులు ఎం.మీనాదేవి, బి.అప్పలస్వామి, టీవీ రాజేష్‌కుమార్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ దేవీ రత్నకుమారి, తదితరులు పాల్గొన్నారు.
మహాశివరాత్రికి
BÈtïÜ {ç³™ólÅMýS ºçÜ$ÞË$ ˘
విజయనగరం గంటస్తంభం: మహాశివరాత్రి పర్వదినాన వివిధ ఆలయాలు సందర్శించే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపనుందని ప్రజారవాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణ, విజయనగరం డిపో మేనేజర్ శ్రీనివాసరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26, 27 తేదీల్లో రామతీర్థానికి 45 బస్సులు నడుపుతామన్నారు. శ్రీకాకుళం–2 డిపో నుంచి 10 బస్సులు, పాలకొండ, చీపురుపల్లి, గరివిడి మీదుగా పాలకొండ డిపో నుంచి 20 బస్సులు వేశామన్నారు. ఎస్.కోట డిపో నుంచి పుణ్యగిరికి 35 బస్సులు, ఎస్.కోట నుంచి సన్యాసిపాలెంకు 10 బస్సులు వేసినట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment