పీహెచ్‌సీల్లో ప్రసవసేవలు అందించాలి
● డీఎంహెచ్‌ఓ జీవనరాణి
విజయనగరం ఫోర్ట్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీ) ప్రసవ సేవలు అందించాలని, లేదంటే చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ జీవనరాణి హెచ్చ రించారు. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో 10 పీహెచ్‌సీల వైద్యాధికారులు, సిబ్బందితో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గర్భిణుల నమోదు, నెలనెలా వైద్యపరీక్షలు తప్పనిసరిగా జరపాలన్నారు. మాతాశిశు మరణా లను నివారించాలన్నారు. హైరిస్క్ గర్భిణులను ముందుస్తుగా ఆస్పత్రుల్లో చేర్పించాలని తెలిపారు. క్షయ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలని, క్షయ వ్యాధి నిర్ధారణ అయిన వారిక మందులు అందజేయాలన్నారు. సమావేశంలో డీఎల్‌ఓ డాక్టర్ కె.రాణి, డీఐఓ డాక్టర్ అచ్యుతకుమారి, డెమో వి.చిన్నతల్లి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment