దత్తిరాజేరు: మండలంలోని కె.కృష్ణాపురంలో మంగళవారం రాత్రి గ్రామంలో జరుగుతున్న పెళ్లి వద్ద ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ కారణంగా గ్రామానికి చెందిన సుమల పైడిపునాయుడికి తీవ్ర గాయాలైనట్లు ఎస్ బూర్జవలస ఎస్సై రాజేష్ బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. రామభద్రపురం మండలం పాతరేగకు గూడాపు సింహాచలం, గాయాల పాలైన పైడిపునాయుడుల మధ్య ఘర్షణ జరిగింది. అక్కడితో ఆగకుండా గ్రామ శివారుకు స్కూటీపై సింహాచలం వచ్చి పైడిపునాయుడిపై కత్తితో దాడిచేయగా గాయాలపాలవడంతో ముందుగా బాడంగి ఆస్పత్రికి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయనగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా వైద్యం పొందుతున్నాడు. దాడిచేసిన సింహాచలాన్ని ఆదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment