వై.ఎస్.జగన్‌తో కురసాల కన్నబాబు భేటీ
సాక్షి, విశాఖపట్నం: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డితో పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు బుధవారం భేటీ అయ్యా రు. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్‌గా కీలక బాధ్యతలు అప్పగించిన తర్వాత తొలిసారి ఆయన జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశా రు. తాడేపల్లిలోని వై.ఎస్.జగన్ క్యాంప్ కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో సమస్యలు గుర్తించి, వాటిపై పోరాడాలని జగన్‌మోహన్‌రెడ్డి కన్నబా బుకు నిర్దేశించారు. టీడీపీ కూటమి ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల్ని మరింత సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ, వారితో మమేకమవుతూ, వారు ఎదుర్కొ ంటున్న సమస్యలను గుర్తించి, పార్టీ పరంగా వేగంగా స్పందించి అండగా నిలవాలని కన్నబాబుకు అధినేత వై.ఎస్.జగన్ ఆదేశించారు.
డీవీఈఓకు ఆచార్య దేవోభవ అవార్డు
పార్వతీపురంటౌన్: జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి డి.మంజులవీణకు ఆచార్య దేవోభవ అవార్డు వరించింది. గణిత శాస్త్ర అధ్యాపకురాలిగా, ఉమ్మడి జిల్లాల ఆర్‌ఐఓగా అందించిన ఉత్తమ సేవలకు ప్రియదర్శిని సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ 2025 సంవత్సరానికి అవార్డును ప్రదానం చేసింది. ఆమెను కలె క్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అభినందించారు. మరిన్ని ఉత్తమ సేవలందించాలని సూచించారు.
నేరాల నియంత్రణకు
పటిష్ట చర్యలు
పార్వతీపురం రూరల్: నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని డీఐజీ గోపినాథ్ జట్టి ఎస్పీలను ఆదేశించారు. విశాఖపట్టణం రేంజ్ కార్యాలయం నుంచి జిల్లాల ఎస్పీలతో వీడియోకాన్ఫరెన్స్‌లో బుధవారం మాట్లాడారు. నేరాలపై సమీక్షించారు. గంజాయి నియంత్రణ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్), ఎన్.బి.డబ్ల్యూ అమలు, సైబర్ నేరాలు, పొక్సో కేసులపై ఆరా తీశారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయదారులపై ప్రత్యేక షీట్స్ ఓపెన్ చేయాలన్నారు. గంజాయి వ్యాపారుల ఆస్తుల స్వాధీనానికి చర్యలు తీసుకోవాలన్నారు. హిట్ అండ్ రన్ కేసుల్లో బాధి తులకు పరిహారం అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీ మాధవ్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రైవేటు ఆస్పత్రుల్లో
నిబంధనలు పాటించాలి
సాలూరు: ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లలో వైద్యారోగ్యశాఖ నియమ నిబంధనలు తప్పక పాటించాలని డీఎంహెచ్‌ఓ డా.భాస్కరరావు స్పష్టం చేశారు. సాలూరు పట్టణంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లను ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఆస్పత్రుల రిజిస్ట్రేషన్‌లు, రెన్యువల్ పత్రాలను పరిశీలించారు. ఆస్పత్రులకు వస్తున్న రోగుల వివరాల నమోదు, వారికి అందిస్తున్న చికిత్స, వసూలు చేస్తున్న ఫీజు తదితర అంశాలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణపై తెలుసుకున్నారు. కార్యక్రమంలో అధికారులు సన్యాసిరావు, యోగీశ్వరరెడ్డి, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment