జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ఏర్పాట్లు పరిశీలన
● నేడు మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పాలకొండ రాక
పాలకొండ: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గురువారం పాలకొండ రానున్నారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ నాయకులు సర్వం సిద్ధం చేశారు. పార్టీ సీనియర్ నాయకుడు పాలవలస రాజశేఖరం ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన కుటుంబాన్ని పరామర్శించేదుకు జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్నారు. దీనికోసం వీరఘట్టం రోడ్డులో హెలిప్యాడ్‌ను సిద్ధంచేశారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటల సమయంలో రోడ్డు మార్గం గుండా ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఏర్పాట్లపై మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, వైఎస్సార్‌సీపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్‌రాజు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు, అలజంగి జోగారావుతో పాటు ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌లు రెవెన్యూ, పోలీస్ అధికారులతో చర్చించారు. హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. రాజశేఖరం ఇంటికి వెళ్లే ప్రధాన మార్గంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అభిమానులను జగన్‌మోహన్‌రెడ్డి పలకరించుకుని వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉపాద్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున కోడ్ ఉల్లంఘన జరగకుండా ఉండేలా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.
జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ఏర్పాట్లు పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment