అంగన్‌వాడీలకు ఆట వస్తువులు
● ఐసీడీఎస్ పీడీ జె.కనకదుర్గ
రామభద్రపురం: అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, పిల్లలు ఆడుకునేందుకు అవసరమైన ఆట వస్తులను సరఫరా చేస్తున్నట్టు పార్వతీపురం మన్యం జిల్లా ఐసీడీఎస్ పీడీ జె.కనకదుర్గ, డీఎంహెచ్‌ఓ ఎస్.భాస్కరరావు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలకు అందజేసేందుకు రామభద్రపురంలోని ఓ ప్రైవేటు ఏజెన్సీ గోదాంలో ఉన్న ఆట పరికరాలను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాక్షం పథకం కింద జిల్లాలోని 2075 అంగన్‌వాడీ కేంద్రాల్లో మొదటి దశలో 113 కేంద్రాలకు క్రీడా పరికరాలు సరఫరాచేశామన్నారు. ఇప్పుడు రెండో దశలో 516 కేంద్రాలకు సరఫరా చేస్తున్నామని, తర్వాత మిగిలిన కేంద్రాలకు సరఫరా అవుతాయన్నారు. పిల్లలు కోసం ఆట వస్తువులతో పాటు టీవీ, ఆర్‌వో ప్లాంట్ తదితర పరికరాలను కేంద్ర ప్రభుత్వం సరఫరాచేస్తోందన్నారు. కొద్ది రోజుల్లో అంగన్‌వాడీ కేంద్రాలకు పాలప్యాకెట్ల సరఫరాను నిలిపివేసి వాటి స్థానంలో పాలపౌడర్‌ను పంపిణీ చేసే అవకాశం ఉందన్నా రు. ముందుగా పైలట్ ప్రాజెక్టు కింద సాలూరు, భద్రగిరి ప్రాజెక్టుల పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తామని చెప్పారు.
జీబీఎస్‌పై ఆందోళన వద్దు..
ప్రస్తుతం కలకలం రేపుతున్న జీబీఎస్ వ్యాధిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని డీఎంహెచ్‌ఓ భాస్కరరావు అన్నారు. జీబీఎస్ అంటువ్యాధి కాదని, నాడీ వ్యవస్థకు సోకే వ్యాధిగా పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యాధి నివారణకు సంబంధించిన మందు లు ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులో ఉన్నాయని, ఉచితంగా సరఫరా చేస్తామన్నారు. కార్యక్రమంలో సీడీపీఓలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment