ఛత్రపతి శివాజీ గొప్ప దేశభక్తుడు
● మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర
సాలూరు: ఛత్రపతి శివాజీ మహాయోధుడే కాదని , గొప్ప దేశభక్తుడని మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. శివాజీ జయంతి సందర్భంగా పట్టణంలోని శివాజీ సెంటర్‌లో ఉన్న ఛత్రపతి శివాజీ విగ్రహానికి బుధవారం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజన్నదొర మాట్లాడుతూ, హైందవ ధర్మ పరిరక్షణకు శివాజీ చేసిన కృషిని దేశం మరిచిపోదని కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్, వైఎస్సార్‌సీపీ పట్టణాధ్యక్షుడు వంగపండు అప్పలనాయుడు, ప్రజాప్రతినిధులు,నాయకులు, గిరిరఘు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
నివాళులర్పించిన మంత్రి సంధ్యారాణి
పట్టణంలోని శివాజీ సెంటర్‌లో ఉన్న శివాజీ విగ్రహానికి సీ్త్ర శిశుసంక్షేమ, గిరిజన సంక్షేమశాఖామంత్రి గుమ్మడి సంధ్యారాణి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శివాజీ దేశ భక్తిని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment