కొటియా గ్రామాల సమస్య పరిష్కరించండి
సాలూరు రూరల్: ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాల పాలకులు సంయుక్తంగా చర్చించి కొటియా సరిహద్దు గ్రామాల సమస్యను పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యధర్శి గంగునాయుడు డిమాండ్ చేశారు. ఆయన దిగువ శెంబి, ఎగువశెంబి, ధూళిభద్ర, గ్రామాల్లో బుధవారం పర్యటించి గిరిజనుల అభిప్రాయాలను సేకరించారు. 21 కొటియా గ్రూపు గ్రామాల ప్రజలు ఆంధ్రాలో కలిసి ఉంటామని చెబుతున్నా ప్రభుత్వం వివాదం పరిష్కంచేందుకు కృషిచేయకపోవడం విచారకరమన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎన్.వై.నాయుడు, కోరాడ ఈశ్వరరావు, సీతయ్య, మహేష్, చోడపల్లి బిరుసు, మర్రి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment