జీడి పరిశ్రమను పరిశీలించిన వీడీవీకే బృందం
పార్వతీపురంటౌన్: సంకల్ప్ పథకంలో భాగంగా పలాసలోని జీడిపప్పు పరిశ్రమను వీడీవీకే (వన్‌ధన్‌వికాస్ కేంద్రం) సభ్యులు బుధవారం సందర్శించినట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె.సాయికృష్ణ చైతన్య తెలిపారు. కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదేశాల మేరకు జిల్లాలో నూతనంగా జీడిపప్పు పరిశ్రమను స్థాపించనున్న వీడివీకే బృందం పలాసలోని ఎస్‌ఎస్‌ఎస్ ఇంటర్నేషనల్ ఆగ్రో ప్రొడక్ట్ ప్రైవేటు లిమిటెడ్ పరిశ్రమను సందర్శించినట్టు వెల్లడించారు. పరిశ్రమ నిర్వహణపై అవగాహన పొందారన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పథక సంచాలకుడు వై. సత్యం నాయుడు, జిల్లా పరిశ్రమల అడిషనల్ డైరెక్టర్, కృషి విజ్ఞాన్ కేంద్రం కోఆర్డినేటర్, హార్టికల్చర్ ఆఫీసర్, మండల ఏపీఎంలు, నైపుణ్యాభివృద్ధి సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment