పార్వతీపురంటౌన్: జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు నిర్వహించిన ప్రయోగ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిని డి.మంజులవీణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు ముగిశాయన్నారు. ఒకేషనల్ విభాగంలో 40 సెంటర్లలో ఫిబ్రవరి 5 నుంచి 19వ తేదీ వరకు, జనరల్ విభాగంలో 37 సెంటర్లలో 10 నుంచి 19వ తేదీ వరకు రెండు స్పెల్‌లలో పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు.
వృక్షశాస్త్రం పరీక్షకు 1808 మంది, జంతుశాస్త్రం పరీక్షకు 1808, భౌతిక శాస్త్రం పరీక్షకు 4,217, రసాయన శాస్త్రం పరీక్షకు 4217 మంది విద్యార్థులు హాజరయ్యారని, ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షకు మొదటి సంవత్సరం 2,881 మంది, రెండవ సంవత్సరం 3,045 మంది విద్యార్థులు హాజరైనట్టు తెలిపారు. పరీక్షల ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment