లలిత క్రీడా వైభవం
విజయనగరం: చైన్నెలోని జవహర్ లాల్ నెహ్రు స్టేడియం వేదికగా ఈ నెల 17 నుంచి వరకు జరిగిన 23వ పారా జాతీయస్థాయి చాంపియన్ షిప్ క్రీడా పోటీల్లో జిల్లాకు స్వర్ణపతకం దక్కిందని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ తెలిపారు. పోటీల్లో పాల్గొన్న జిల్లాకు చెందిన కిల్లక లలిత 400 మీటర్ల పరుగు పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరచి గోల్డ్ మెడల్ సాధించిందని తెలిపారు. గతం లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక మెడల్స్ సాధించిన లలిత చైన్నెలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో గోల్డ్‌మెడల్ సాధించడంతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించినట్లు చెప్పారు. ఈ విజయం క్రీడల్లో జిల్లా ప్రతిష్టను మరింత పెంచిందని, భవిష్యత్‌లో ఆమె మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. పారా జాతీయపోటీల్లో పతకం సాధించిన లలితతో పాటు కోచ్ తబరీష్‌లను కలెక్టర్ డాక్టర్.బీఆర్.అంబేడ్కర్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావు, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు, కార్యదర్శి వి.రామస్వామిలు అభినందనలు తెలియజేశారు.
పారా జాతీయస్థాయి పోటీల్లో స్వర్ణపతకం
Comments
Please login to add a commentAdd a comment