సాలూరు: ఉద్యోగులు, సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని సబ్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జి పీఓ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. సాలూరు తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను శనివారం తనిఖీ చేశారు. మ్యుటేషన్, రీసర్వే రికార్డులు, రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన వినతుల పరిష్కారంపై ఆరా తీశారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. అనంతరం ఆయన ఎంఎల్‌ఎస్ పాయింట్‌ను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ భానుప్రసాద్ పాల్గొన్నారు.
ఎమ్‌ఎల్‌ఎస్ పాయింట్‌లో స్టాక్‌ను తనిఖీచేస్తున్న ఐటీడీఏ ఇన్‌చార్జి పీఓ అశుతోష్ శ్రీవాస్తవ
Comments
Please login to add a commentAdd a comment