పట్టుదలతో చదివి అధిక మార్కులు సాధించండి
పార్వతీపురంటౌన్: పదోతరగతి విద్యార్థులు పట్టుదలతో చదివి అధిక మార్కులు సాధించాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ పిలుపునిచ్చారు. పార్వతీపురంపట్టణంలోని మున్సిపల్ డీవీఎంఎం ఉన్నత పాఠశాలను ఆయన శనివారం సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థుల చదువు, భవిత ప్రణాళికను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు భవితకు పదోతరగతి, ఇంటర్మీడియట్ కీలకమన్నారు. కష్టపడే స్వభావానికి సరైన వ్యూహాలు తోడైతేనే సానుకూల ఫలితాలు వస్తాయని గ్రహించాలని, ఆ దిశగా మీ మేధస్సుకు పదునుపెట్టాలని హితవు పలికారు. అనంతరం చర్చి వీధిలోని వార్డు విజ్ఞాన కేంద్రాన్ని తనిఖీచేశారు. గ్రూప్ 2, ఇతర పోటీ పరీక్షలకు సాధనచేస్తున్న యువతీ, యువకులతో మాట్లాడారు. వసతులపై ఆరా తీశారు. అందుబాటులో ఉన్న పోటీ పరీక్షల పుస్తకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమయాన్ని వృథా చేసుకోకుండా విద్యా ప్రమాణాలు ఉన్నతీకరించుకోవడానికి నిరంతర శ్రమ అలవర్చుకోవాలన్నారు. నిరుద్యోగులకు ఉపయోగపడేలా వివిధ ఉద్యోగ ప్రకటనలను నోటీసు బోర్డులో ప్రదర్శించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.తిరుపతి నాయుడు, మండల విద్యాధికారి వై.విమల కుమారి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోవిందరావు, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment